రోడ్డు ప్రమాదంలో ఎంఈవో మృతి
పిడుగురాళ్ళ టౌన్: ఆగివున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో మాచవరం ఎంఈవో మృతి చెందారు. పిడుగురాళ్ల∙పట్టణ శివారు ఆంజనేయస్వామి గుడివద్ద గురువారం రాత్రి ప్రమాదం జరిగింది. అందిన వివరాల ప్రకారం.. మాచవరం ఎంఈవో వై.పూర్ణచంద్రారెడ్డి పిడుగురాళ్ళలో నివాసం ఉంటూ ద్విచక్రవాహనంపై మాచవరం వెళ్లి విధులు నిర్వహిస్తుంటారు. రోజూలాగానే విధులు నిర్వహించి ద్విచక్రవాహనంపై వస్తుండగా చీకట్లో ఆగివున్నలారీని ప్రమాదవశాత్తు ఢీకొట్టారు. ఘటనలో ఎంఈవో తీవ్రగాయాల పాలయ్యారు. స్థానికులు పిడుగురాళ్ళ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఎంఈవో మృతి చెందారు.