మిర్యాలగూడను నల్లగొండలో ఉంచేందుకే..
Published Thu, Sep 1 2016 1:38 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గాన్ని నల్లగొండ జిల్లాలో ఉంచడానికే పార్టీ మారానని స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అ న్నారు. బుధవారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మిర్యాలగూడకు చెందిన వ్యాపారులు, డాక్టర్లు, మిల్లర్లు, న్యా యవాదులు అంతా కలిసి మిర్యాలగూడను నల్లగొండలో ఉంచాలని తనను కోరానని తెలిపారు. అయితే తాను కాంగ్రెస్‌లో ఉంటే అది సాధ్యం కాదని గుర్తించి పార్టీ మారానని చెప్పా రు. మొదట మిర్యాలగూడను జిల్లా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరానని, అది సాధ్యం కాకపోవడం తో న ల్లగొండలో ఉంచాలని కోరిన ట్లు పే ర్కొన్నారు. అంతకు ముందుగా కౌన్సిలర్‌లు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గాన్ని నల్లగొండ లో ఉంచడానికి కృషి చేసిన ఎంపీ గు త్తా సు ఖేందర్‌రెడ్డికి, ఎమ్మెల్యే నల్లమో తు భా స్కర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపా రు.
షీ టాయిలెట్స్ నిర్మాణానికి తీర్మానం...
పట్టణంలో మహిళల కోసం షీ టాయిలెట్స్ నిర్మించాలని మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. పట్టణంలోని నాల్గో వార్డులోని సౌజన్య లాడ్జి సమీపంలో ఉన్న మున్సిపల్ స్థలంలో వీటిని నిర్మించాలని తీర్మానం చేశారు. అదే విధంగా కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు ఇవ్వని కాంట్రాక్టర్‌ను కూడా బ్లాక్ లిస్టులో పెట్టాలని తీర్మానించారు. సమావేశానికి మున్సిపల్ చైర్‌పర్సన్ తిరునగరు నాగలక్ష్మీ బార్గవ్ అధ్యక్షత వహించగా మున్సిపల్ కమిషనర్ సత్యబాబు, వైస్ చైర్మన్ మగ్దూమ్‌పాషా, కౌన్సిలర్లు వంగాల నిరంజన్‌రెడ్డి, నామిరెడ్డి దయాకర్‌రెడ్డి, అన్నభీమోజు శ్రవంతి, నూకల కవిత, మాజిద్, రేపాల పురుషోత్తంరెడ్డి, మహ్మద్ గని, పాండు పాల్గొన్నారు.
Advertisement
Advertisement