-
విధులు బహిష్కరించి నిరసనలు
-
సోమవారం నుంచి నిరవధిక ఆందోళనకు కార్యాచరణ
-
చింతిస్తున్నా... నిరసనలు వద్దు : ఎమ్మెల్యే వర్మ
కాకినాడ వైద్యం :
పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎ¯ŒS వర్మ దూర్భాషలాడుతూ, పరుష పదజాలంతో మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారంటూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వైద్యులు శనివారం ఆందోళన బాట పట్టారు. తక్షణమే ఎమ్మెల్యే వర్మపై పోలీసు కేసు నమోదు చేయాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని, న్యాయం కావాలంటూ ఆసుపత్రి గేటు ముందు బైఠాయించి, ఆందోళనకు దిగారు. వైద్యులు అత్యవసర విభాగంలోని సేవలను మినహాయింపునిచ్చి, మిగతా అన్ని రకాల సేవలను బహిష్కరించడంతో రోగులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. వైద్య సాయం కోసం అనేక వ్యయప్రయాసలకోర్చి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆందోళన విషయమై చర్చించేందుకు ముందుగా జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశాలపై జేసీ–2 రాధాకృష్ణమూర్తి వచ్చి సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ కరీముల్లాతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి జరిగిన సంఘటనపై వివరించారు.
క్షమాపణ చెప్పేదాకా విరమించేదిలేదు...
రోగుల ముందు అసçహ్య పదజాలంతో తమను దూషించడమే కాకుండా చేతిలోని సెల్‌ఫో¯ŒSను తీసి కిందకి గిరాటు వేశారని సీఎంవో కరీముల్లా వివరించాడు. ఎమ్మెల్యే వచ్చి క్షమాపణ చెప్పేదాకా ఆందోళన కార్యక్రమం వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేయడంతో వైద్య సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యులు ఆసుపత్రికి వచ్చే రోగులు, విద్యార్థులకు విధులు ఎందుకు బహిష్కరించాల్సి వచ్చిందో వివరించారు. ఆందోళన కారణంగా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు నిరాశగా వెనుదిరిగి పోయారు. కార్యక్రమంలో ఏపీజీడీఏ, ఎంసీఏ అధ్యక్షుడు డా.విజయేంద్ర, డా.జవహర్ రాంస్వరూప్, డా. వెంకటరెడ్డి, సీఐటీయూ, డా.లకో‡్ష్మజీనాయుడు, సీఎస్‌ఆర్‌ఎంవో డా. టీఎ¯ŒSఎ¯ŒS మూర్తి, పలువురు అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు, పీజీ వైద్యులు, హౌస్ సర్జన్లు, పారా మెడికల్, స్టాఫ్ నర్సుల సంఘంనేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నేపథ్యమిదీ....
పిఠాపురం మండలం పి.రాయవరం పంచాయతీ తాత్కాలిక వర్కర్‌గా పనిచేస్తున్న సీలు మరిడేశ్వరరావు వీధిదీపాల పనులు చూస్తూంటారు. శుక్రవారం విద్యుత్తు మరమ్మతుల కోసం స్తంభం ఎక్కి, విద్యుదాఘాతంతో కిందపడిపోయాడు. ఈ ఘటనలో నడుం, కాలుకి తీవ్ర గాయాలయ్యాయి. వైద్య చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి అత్యవసర విభాగానికి బంధువులు తీసుకొచ్చారు.
సీటీ స్కా¯ŒS అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్‌గా వైద్యులు పరీక్షలు చేయించారు. ఈలోగా తమకు వైద్యం సక్రమంగా అందడంలేదంటూ రోగి బంధువులు పిఠాపురం ఎమ్మెల్యే వర్మకు ఫో¯ŒS చేశారు. అక్కడ ఎవరున్నారు, ఫో¯ŒS ఇవ్వమని ఎమ్మెల్యే అడగ్గా రోగి వచ్చి ఎమ్మెల్యే మాట్లాడతారంటూ ఫో¯ŒS ఇస్తుండగానే ‘ఎమ్మెల్యే ఎవరని’ సీఎంవో కరీముల్లా ప్రశ్నించారు. ఆ మాట విన్న ఎమ్మెల్యే ‘ఫో¯ŒS చేస్తేనే మాట్లాడరా’అంటూ హుటాహుటిన పిఠాపురం నుంచి కాకినాడ ఆసుపత్రికి వచ్చి సూపరింటెండెంట్ నాగేశ్వరరావును నిలదీశారు. సకాలంలో వైద్యం చేయకుండా ఏమి చేస్తున్నారు? ఏ ఎమ్మెల్యే అని అడుగుతావా’ అంటూ నానా దూర్భాషలాడుతూ, అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సీఎంవో డా.కరీముల్లా తెలిపారు. ఎమ్మెల్యే అయిన నేను ఫో¯ŒS చేస్తే తీయవా, నీకు ఉద్యోగుం ఎవడిచ్చారు. వేస్ట్, యూస్‌లెస్ ఫెలో అంటూ అ¯ŒS పార్లమెంటరీ లాంగ్వేజ్‌లో అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు మీరు ఫో¯ŒS చేయలేదు..కావాలంటే ఫో¯ŒS చూడండంటూ వివరిస్తుండగానే చేతిలోని సెల్‌ఫో¯ŒS లాక్కుని కిందకి గిరాటు వేశారని వివరించారు.
సీసీ పుటేజీ పరిశీలన...
శుక్రవారం రాత్రి ఎమర్జెన్సీ విభాగంలో పిఠాపురం ఎమ్మెల్యే వర్మ, వైద్యుల మధ్య జరిగిన సంఘటనపై నిజనిర్థారణ కోసం సీసీ పుటేజీలను రప్పించుకుని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, వైద్య సంఘాల నేతల సమక్షంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్మ, అనుచరులు, వైద్యుల మధ్య జరిగిన వాదోపవాదాలను పరిశీలించారు.
వైద్యాధికారులతో నగర ఎమ్మెల్యే చర్చలు...
ఆసుపత్రి గేటు ముందు వైద్యాధికారులు,వైద్యులు ఆందోళన చేస్తున్న క్రమంలో కాకినాడ సీటీఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు వచ్చి, సూపరింటెండెంట్ ఛాంబర్‌లో జేసీ–2, వైద్య సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, ఆందోళన విరమించాలని ఎమ్మెల్యే కోరారు. నిరుపేద రోగుల ఇక్కట్లను మానవతా దృక్పథంతో ఆలోచించి సహకరించాలని కోరారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని, బేషరతుగా క్షమాపణ చెప్పేదాకా ఆందోళన కొనసాగుతుందని భీష్మించడంతో చర్చలు ఫలించలేదు.
వైద్యులు లేక రోగుల తీవ్ర ఇక్కట్లు
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవలు పొందేందుకు నిత్యం ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాకుండా విశాఖపట్నం జిల్లా నుంచి కూడా రోగులు ఇక్కడకు వస్తుంటారు. శనివారం కూడా యథావిధిగా రోగులు వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారు. వైద్యం అందించేందుకు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సాయంత్రం దాకా రోగులు వేచిచూసి నిరాశగా వెనుదిరిగారు. సోమవారం కూడా వైద్యులు ఆందోళన విరమించకపోతే నానా ఇక్కట్లకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వార్డుల్లో బల్లలు ఖాళీగా దర్శనమిచ్చాయి.
అయితే చింతిస్తున్నా...
శుక్రవారం రాత్రి వైద్యుల పట్ల నేను ప్రవర్తించిన తీరు బాధ కల్గిస్తే దానికి నేను చింతిస్తున్నా. రోగులకు సత్వర వైద్యం అందాలనే తపనతోనే ఆ రకంగా మాట్లాడాను. ఇప్పుడు కూడా రోగులు ఇబ్బంది పడకూడదనే వచ్చా..
– ఎమ్మెల్యే వర్మ