మోడల్ పోలీస్ స్టేషన్ల పరిశీలన
గుంటూరు (పట్నంబజారు): గుంటూరులో నూతనంగా నిర్మితమవుతున్న పాతగుంటూరు. నగరంపాలెం మోడల్ పోలీసుస్టేషన్‌లను ఆదివారం డీజీపీ నండూరి సాంబశివరావు ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్ నిర్మాణ పనుల్లో నాణ్యతను పరిశీలించారు. త్వరితగతిన నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అడిషనల్ ఎస్పీ జె.భాస్కరరావు, డీఎస్పీలు జేవీ సంతోష్, కేజీవీ సరిత, కండె శ్రీనివాసులు తదితరులున్నారు.