model police station
-
మోడల్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన హోంమంత్రి
సాక్షి, ఆవనిగడ్డ(కృష్ణా) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం ఆవనిగడ్డలో మోడల్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు పేర్ని నాని, మోపిదేవి వెంకటరమణ, అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్, డిఐజి ఏఎస్ ఖాన్లు అతిథులుగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన హోంమంత్రి మేకతోటి సుచరితకు అధికారుల సమక్షంలో ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పోలీస్ సిబ్బందికి మౌలిక సదుపాయల కల్పన కోసమే మోడల్ పోలీస్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు సుచరిత పేర్కొన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మహిళల సమస్యలను పరిష్కరించడానికి ' మహిళా క్రాంతి' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో 'మహిళా మిత్ర' పేరిట ఒక మహిళా కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేస్తే మహిళలు తమ సమస్యలను మరింత స్వేచ్ఛగా తెలపడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. మహిళా పోలీసులు బందోబస్తుకు వెళ్లినపుడు వారికి కనీస అవసరాలు తీర్చేందుకు మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అవినీతి రహితంగా ఉంటూ, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా లక్ష్యం పెట్టుకోవాలని సుచరిత పిలుపునిచ్చారు. -
గ్రామీణ పోలీస్ స్టేషన్లలో మార్పులు
♦ పోలీస్ కమిషనర్లు/ఎస్పీలతో డీజీపీ సుదీర్ఘ భేటీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ తరహాలో ప్రతి జిల్లా పోలీస్ యూనిట్ మార్పు చెందాలని డీజీపీ అనురాగ్ శర్మ ఆకాంక్షించారు. పెరుగుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా పోలీస్ సిబ్బందితోపాటు పోలీస్ వ్యవస్థ కూడా అప్‌గ్రేడ్ కావాల్సిన అవసర ముందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పోలీస్ శాఖలో నూతన పోలీసింగ్ విధానం– అమ లుపై రాష్ట్రవ్యాప్తంగా ఐపీఎస్ అధికారులం దరితో గురువారం సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.పదేళ్లలో పోలీస్ శాఖ తీసు కురావాల్సిన యాక్షన్ ప్లాన్‌పై చర్చించారు. జిల్లా పోలీస్ స్థిరీకరణ ప్రణాళిక.. ప్రతి పోలీస్‌స్టేషన్ అవసరాలను గుర్తించి వాటిని ఆధునిక సౌకర్యాలతో ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ వెస్ట్ జోన్ ఐ.జి. స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో జిల్లా స్థిరీకరణ ప్రణాళిక తయారు చేశారు. ప్రక్షాళనకు అవసరమైన మౌలిక వసతులపై చర్చించారు. మే నెలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోలీస్ అధికారుల సమావేశం అనంతరం హైదరాబాద్ సిటీ పోలీస్ తరహాలో ప్రతీ పోలీస్ స్టేషన్లోను అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని డీజీపీ నిర్ణయించారు. యూనిట్ అధికారులు జిల్లా నుంచి ఇన్స్పెక్టర్, ఎస్.ఐ.హోదా అధికా రులతో కూడిన 7 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలు హైదరాబాద్‌లోని పోలీస్ స్టేషన్లను పరిశీలించడంతో పాటు స్టేషన్ అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. కాగా టెక్నాలజీని, స్టేషన్ వాతావరణాన్ని మార్చేందుకు ప్రతీ జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఒక మోడల్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ట్రైనీ ఐపీఎస్‌ల సందర్శన ప్రస్తుతం సర్దార్ వల్లభ్‌భాయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 4 రాష్ట్రాలకు చెందిన 16మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు గురువారం డీజీపీ అనురాగ్ శర్మను కలిశారు. తెలంగాణలోని సాంస్కృతిక వ్యవహారాలు, పోలీసింగ్ విధానంపై పలు విషయాలను ఆయన్ను అడిగి తెలుసుకున్నారు. డ్రగ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ హైదరాబాద్‌ను డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు. డ్రగ్స్ వ్యవహారంలో ఆబ్కారీ శాఖ చేస్తున్న దర్యాప్తునకు తమ టాస్క్‌ఫోర్స్‌తో పాటు ఇంటెలిజెన్స్ విభాగాలు సహకారం అందిస్తున్నాయని తెలిపారు. -
గుంటూరులో మోడల్ పోలీస్ స్టేషన్
పట్నంబజారు (గుంటూరు) : గుంటూరులో నూతనంగా ఏర్పాటుచేసిన నగరంపాలెం, పాతగుంటూరు మోడల్ పోలీస్స్టేషన్లను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లోనే పాతగుంటూరు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. హెలికాప్టర్లో బ్రహ్మానందరెడ్డి స్టేడియానికి నేరుగా చేరుకున్న ఆయన హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబులతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర అధికారులతో కలిసి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. డీజీపీ నండూరి సాంబశివరావు, ఇతర పోలీసు అధికారులు సీఎంకు స్వాగతం పలికగా, కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, ఆహ్వానితులకు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అడిషనల్ ఎస్పీ జె.భాస్కరరావు ఆహ్వానం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం స్టేషన్‌ను పరిశీలించారు. అనంతరం పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పోలీసు నియమావళి పుస్తకావిష్కరణ... సభా ప్రాంగణంలో పోలీసు నియమావళి పుస్తకాన్ని డీజీపీ సాంబశివరావు విజ్ఞప్తి మేరకు సీఎం ఆవిష్కరించారు. 2001 సంవత్సరం తరువాత పోలీసు మాన్యువల్‌ను మరోసారి సిద్ధం చేసినట్లు ఈ సందర్భంగా డీజీపీ సాంబశివరావు తెలిపారు. అనంతరం గత ఏడాది నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్ పరీక్షల్లో అర్హత సాధించిన 4500 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అనంతరం ఏపీ పోలీసులకు సంబంధించి నూతనంగా ఏర్పాటు చేసిన హెల్త్ స్మార్ట్ కార్డులను ఆవిష్కరించారు. పోలీసుల వైద్య పరీక్షల కోసం అత్యవసరంగా రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు పోలీసు ఈ–లెర్నింగ్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. పలువురికి ప్రశంసా పత్రాలు... పోలీసు శాఖలోని క్రైం విభాగంలో నిందితులు, దొంగలను పట్టుకోవటంతో పాటు భారీ కేసులను ఛేదించిన నలుగురికి ఎ, బి, సి, డి.. ప్రాతిపదికన ప్రశంసాపత్రాలు, అవార్డులను అందజేశారు. దీనిలో ‘ఎ’ కింద కర్నూలుకు చెందిన డీఎస్పీ అశోక్‌కుమార్, రాజమండ్రి సీఐ రవికుమార్, విజయవాడ సీఐ సహేరా, అడిషనల్ డీజీ అతుల్సింగ్లకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు హోం శాఖ కార్యదర్శి అనురాధ, విజయవాడ నగర కమిషనర్ గౌతమ్ సవాంగ్, అడిషనల్ డీజీలు ఠాగూర్, ద్వారక తిరుమలరావు, సురేంద్రబాబు, ఐజీలు సునీల్‌కుమార్, మహేష్ చంద్ర లడ్హా, హరీష్‌కుమార్ గుప్తా, ఎన్.సంజయ్, రమణకుమార్, కలెక్టర్ కాంతిలాల్ దండే, గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలు సర్వశ్రేష్ఠత్రిపాఠి, నారాయణ నాయక్, పీæవీఎస్ రామకృష్ణ, హరికుమార్, రాజకుమారి, గోపీనాథ్ జెట్టి, కోటేశ్వరరావు, నగర కమిషనర్ నాగలక్ష్మి, జేసీ కృతికా శుక్లా, జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్, ఎమ్మెల్యేలు షేక్ మొహమ్మద్ ముస్తఫా, మోదుగుల వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోడల్ పోలీస్ స్టేషన్ల పరిశీలన
గుంటూరు (పట్నంబజారు): గుంటూరులో నూతనంగా నిర్మితమవుతున్న పాతగుంటూరు. నగరంపాలెం మోడల్ పోలీసుస్టేషన్లను ఆదివారం డీజీపీ నండూరి సాంబశివరావు ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్ నిర్మాణ పనుల్లో నాణ్యతను పరిశీలించారు. త్వరితగతిన నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అడిషనల్ ఎస్పీ జె.భాస్కరరావు, డీఎస్పీలు జేవీ సంతోష్, కేజీవీ సరిత, కండె శ్రీనివాసులు తదితరులున్నారు. -
అబిడ్స్‌లో మోడల్ పోలీస్‌స్టేషన్