డీజీపీ నండూరి సాంబశివరావు, ఇతర పోలీసు అధికారులు సీఎంకు స్వాగతం పలికగా, కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, ఆహ్వానితులకు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అడిషనల్ ఎస్పీ జె.భాస్కరరావు ఆహ్వానం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం స్టేషన్‌ను పరిశీలించారు. అనంతరం పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
పోలీసు నియమావళి పుస్తకావిష్కరణ...
సభా ప్రాంగణంలో పోలీసు నియమావళి పుస్తకాన్ని డీజీపీ సాంబశివరావు విజ్ఞప్తి మేరకు సీఎం ఆవిష్కరించారు.
2001 సంవత్సరం తరువాత పోలీసు మాన్యువల్‌ను మరోసారి సిద్ధం చేసినట్లు ఈ సందర్భంగా డీజీపీ సాంబశివరావు తెలిపారు. అనంతరం గత ఏడాది నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్ పరీక్షల్లో అర్హత సాధించిన 4500 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అనంతరం ఏపీ పోలీసులకు సంబంధించి నూతనంగా ఏర్పాటు చేసిన హెల్త్ స్మార్ట్ కార్డులను ఆవిష్కరించారు. పోలీసుల వైద్య పరీక్షల కోసం అత్యవసరంగా రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు పోలీసు ఈ–లెర్నింగ్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు.
పలువురికి ప్రశంసా పత్రాలు...
పోలీసు శాఖలోని క్రైం విభాగంలో నిందితులు, దొంగలను పట్టుకోవటంతో పాటు భారీ కేసులను ఛేదించిన నలుగురికి ఎ, బి, సి, డి.. ప్రాతిపదికన ప్రశంసాపత్రాలు, అవార్డులను అందజేశారు. దీనిలో ‘ఎ’ కింద కర్నూలుకు చెందిన డీఎస్పీ అశోక్‌కుమార్, రాజమండ్రి సీఐ
రవికుమార్, విజయవాడ సీఐ సహేరా, అడిషనల్ డీజీ అతుల్‌సింగ్‌లకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.
కార్యక్రమంలో పోలీసు అధికారులు హోం శాఖ కార్యదర్శి అనురాధ, విజయవాడ నగర కమిషనర్ గౌతమ్ సవాంగ్, అడిషనల్ డీజీలు ఠాగూర్, ద్వారక తిరుమలరావు, సురేంద్రబాబు, ఐజీలు సునీల్‌కుమార్, మహేష్ చంద్ర లడ్హా, హరీష్‌కుమార్ గుప్తా, ఎన్.సంజయ్, రమణకుమార్, కలెక్టర్ కాంతిలాల్ దండే, గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలు సర్వశ్రేష్ఠత్రిపాఠి, నారాయణ నాయక్, పీæవీఎస్ రామకృష్ణ, హరికుమార్, రాజకుమారి, గోపీనాథ్ జెట్టి, కోటేశ్వరరావు, నగర కమిషనర్ నాగలక్ష్మి, జేసీ కృతికా శుక్లా, జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, ఎమ్మెల్యేలు షేక్ మొహమ్మద్ ముస్తఫా, మోదుగుల వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.