అనంతపురం అగ్రికల్చర్ : ఎంపీఈఓలు వ్యవసాయశాఖ పరి ధిలో రైతులకు విశిష్ట సేవలు అందిస్తున్నారని ఎంపీఈవోల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శ్రీహరిరావు అన్నారు. స్థానిక కృషి భవన్‌లో ఆదివారం జిల్లా ఎంపీఈవోల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఎంపీఈఓల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాదబీమా వర్తింపజేయాలని, వేతన చెల్లింపులు నెలవారీగా చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన ఎంపీఈవోల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.