- వాటికి స్థల వివాదం తోడు..
- మధురపూడిలో పోలీసు పికెట్
- భయాందోళనలో స్థానికులు
పాత కక్షలతోనే హత్యాకాండ
Published Fri, Dec 30 2016 11:21 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
మధురపూడి :
రాజమహేంద్రవరం విమానాశ్రయం సమీపంలో గురువారం రాత్రి 11 గంటలకు జరిగిన హత్యల ఘటన స్థానికంగా తీవ్రసంచలనం రేపింది. ఎయిర్ పోర్టు రోడ్డులో మద్దా చిన్ని(28), కొల్లపు వీర్రాజు(40)లను ప్రత్యర్థులు హత్యచేశారు. ఈ దాడిలో పాముల శ్రీను తలకు బలమైన గాయం కాగా. మద్దా అబ్బులుకు కడుపులోని పేగులు బయటకు రావడంతో ఇద్దరూ రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అలాగే చిన్ని మేనత్త కేతా పార్వతికి బలమైన గాయాల య్యాయి.
గొడవలు వద్దన్నందుకు బలైన వీర్రాజు
గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఎయిర్‌పోర్టు సమీపంలో పాముల శ్రీను, అంబటి రమేష్ వర్గాలకు మధ్య వాగ్వాదం జరిగి కొట్లాటకు దారితీసింది. మద్దా చిన్ని వర్గీయులపై, అంబటి రమేష్, అంబటి వెంకటేశ్వరరావు, పిట్టా శేఖర్, పిట్టా ఆనంద్, చిన్నారి, సుబ్రహ్మణ్యం దాడి చేయడం సరైందికాదని విడదీయడానికి వెళ్లిన కొల్లపు వీర్రాజును ఛాతిలో, కడుపులో కత్తితో పొడిచారు. తీవ్ర గాయాలతో ఉన్న వీర్రాజు ఎవరికీ ప్రమాదం జరగకూడదన్న ఆలోచనతో తన కారును డ్రైవ్ చేస్తూ కోరుకొండ పోలీసు స్టేష¯ŒSకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కాగా పోలీసులు అతనిని ఆస్పత్రికి వెళ్లమని సూచించారు తప్ప వారు తీసుకువెళ్లలేదు. అయినప్పటికీ మద్యంమత్తులో ఉన్న వీర్రాజు అదే కారులో రాజమహేంద్రవరం ఆస్పత్రికి వెళ్తుండగా పరిస్థితి విషమించి దారిలోనే మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా దాడికి పాల్పడ్డ అంబటి వెంకటేశ్వర్లు, పిట్టా శేఖర్ తదితరులు సైతం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
జరిగిందిదీ..
అంబటి వెంకటేశ్వర రావుకు, పాముల శ్రీను కుటుంబాల మధ్య స్థల వివాదం ఉంది. ఆరు నెలల క్రితం కోరుకొండ పోలీసుస్టేçÙ¯ŒSలో ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. పోలీసులు వారి మధ్య రాజీ కుదిర్చారు. రెండు నెలల క్రితం శ్రీనుపై దాడి చేయగా అతని కాలు, చేయి విరిగి క్రమేణా కోలుకున్నాడు. అనంతరం వ్యాన్ డ్రైవర్‌గా కాలం వెళ్లదీస్తున్నాడు. ఇరు వర్గాలవీ పక్కపక్క ఇళ్లే కావడంతో గురువారం వారు మళ్లీ గొడవపడ్డారు. అది తారాస్థాయికి చేరి ఎయిర్‌పోర్టు సమీపంలో దాడికి దారితీసింది.
పాత కక్షలే కారణం
25 సంవత్సరాల క్రితం మద్ధా చిన్ని తండ్రి ప్రకాశం పిట్టా సత్యనారాయణను హత్య చేశాడు. ఆ ఘటనలో మత్స్యకార సొసైటీ అధ్యక్షుడైన ప్రకాశం పరారై తర్వాత పోలీసులకు చిక్కి, ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అప్పటి నుంచి అంబటి రమేష్ వర్గీయులు, వారి బంధువులయిన పిట్టా శేఖర్ తదితరులు చాలా కాలంగా దాడి కోసం ఎదురుచూస్తున్నారు. గురువారం పరిస్థితి అనుకూలించడంతో దాడికి దిగారు.
గ్రామంలో పోలీసు పికెట్
మధురపూడిలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు పోలీసు పికెట్ ఏర్పాటుచేసినట్టు ఎస్సై మురళీమోహన్ తెలిపారు.
Advertisement
Advertisement