వివరాలు వెల్లడిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ శశికళ
కోవెలకుంట్ల డిగ్రీ కళాశాలకు బీ డబుల్ ప్లస్ గ్రేడ్
Published Sat, Sep 17 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
– 2.77 పాయింట్లతో రాష్ట్రంలో మొదటి స్థానం
– కళాశాల అభివద్ధికి రూ. 2 కోట్ల రూసా నిధులు
కోవెలకుంట్ల: పట్టణంలోని వాసవీ బొమ్మిడాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ సంస్థ బీ డబుల్ ప్లస్ గ్రేడు ప్రకటించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ నాదం శశికళ చెప్పారు. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి ఐదేళ్లకొకసారి న్యాక్ బృందం కళాశాలను తనిఖీ చేస్తుందన్నారు. ఈ ఏడాది జులై 29, 30వ తేదీల్లో కోయంబత్తూరుకు చెందిన ప్రొఫెసర్ నటరాజన్, బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ రాధాకష్ణతో కూడిన బృందం కళాశాలను సందర్శించిందన్నారు. కళాశాలలో విద్యార్థుల చదువు, అధ్యాపకుల బోధన, విద్యార్థుల నడవడిక, పరిశోధనలు, మౌలిక సదుపాయాలు, వసతులు, కళాశాలలో విద్యపూర్తి చేసుకుని స్థిరపడిన పూర్వ విద్యార్థుల వివరాలు, కళాశాలకు పూర్వ విద్యార్థుల చేయూత, తదితర అంశాలను పరిశీలించిందన్నారు. తుది నివేదికను బెంగళూరులోని న్యాక్ కార్యాలయంలో అందజేయగా ఇటీవలే ఆ సంస్థ అధికారుల సమావేశం నిర్వహించి కళాశాలకు బీ డబుల్ ప్లస్ గ్రేడును కేటాయించనట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే అత్యధికంగా 2.77 కిమిలేటివ్ గ్రేడ్ పాయింట్లు (సీజీపీఏ) కేటాయించడంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, దాతల సమష్టి కృషితో ఉత్తమ గ్రేడు సాధ్యమైందన్నారు. కళాశాలకు బీ డబుల్ ప్లస్ గ్రేడు రావడంతో రూ. 2 కోట్ల రూసా నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ నిధులను అదనపు గదుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు వెచ్చించి కళాశాలను మరింత అభివృద్ధి చేసే అస్కారం ఉందన్నారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శివారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement