NAC
-
‘గుర్తింపు’నకు ససేమిరా.. ప్రమాణాలు అరకొర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రమాణాలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) నివేదిక స్పష్టం చేస్తోంది. జాతీయస్థాయిలో నాక్ గుర్తింపు పొందిన ఉన్నత విద్యాసంస్థలు 21 శాతం ఉంటే, తెలంగాణలో 11 శాతమే ఉండటాన్ని నివేదిక ప్రస్తావించింది. పరిశోధన, మౌలిక వసతుల కల్పనలో ఉన్నత విద్యాసంస్థలు వెనుకబడి ఉన్నాయని పేర్కొంది. వివిధ రాష్ట్రాల్లోని ఉన్నత విద్య ప్రమాణాలపై నాక్ అధ్యయనం చేసింది. ఇందులోభాగంగా తెలంగాణలో జరిపిన అధ్యయనానికి సంబంధించిన నివేదికను ఇటీవల బెంగుళూరులో విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,976 ఉన్నత విద్యా సంస్థలుంటే, ఇందులో 141 మాత్రమే నాక్ గుర్తింపు పొందాయి. వీటిల్లో 35 ప్రభుత్వ, 19 గ్రాంట్–ఇన్–ఎయిడ్, 87 ప్రైవేటు సెల్ఫ్ ఫైనాన్స్ సంస్థలున్నాయి. రాష్ట్రంలోని 24 విశ్వవిద్యాలయాల్లో పదింటికే నాక్ గుర్తింపు ఉంది. ప్రభుత్వంలోని శాతవాహన, జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్, అంబేడర్ ఓపెన్ యూనివర్సిటీలకు ఇప్పటి వరకూ నాక్ గుర్తింపు లేదు. నాక్ గుర్తింపు ఉన్న 141 కాలేజీల్లో 81 కాలేజీలు తిరిగి గుర్తింపు కోసం దరఖాస్తు చేయలేదు. పట్టణ ప్రాంతాల్లోని 72 కాలేజీలకు, సెమీ అర్బన్‌లో 6, గ్రామీణ ప్రాంతాల్లో 63 సంస్థలకు గుర్తింపు ఉంది. వెనుకబాటుకు కారణాలేంటి? రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో సింహభాగం గ్రామీణ నేపథ్యంలోనే ఉన్నాయి. నాక్ గుర్తింపు పొందాలంటే నాణ్యత ప్రమాణాలు పెంచాలి. దీనికి నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. అరకొర ఆదాయం వచ్చే ఈ కాలేజీలు ఈ దిశగా ముందుకెళ్లడం లేదు. నాక్ గుర్తింపు కోసం కనీసం దరఖాస్తు చేసేందుకు కూడా ఇష్టపడటం లేదు. పట్టణ ప్రాంతాల్లో బడ్జెట్ కాలేజీలు కూడా ఆదాయం పెద్దగా ఉండటం లేదని నాక్ ప్రమాణాల వైపు చూడటం లేదు. రాష్ట్రంలోని 71 శాతం ఉన్నత విద్యాసంస్థలకు ఇప్పటికీ సొంత భవనాలు లేవని నివేదిక పేర్కొంది. వీటిల్లో 36 శాతం కాలేజీల్లో కనీస వసతులు కూడా లేవంది. బోధనా సిబ్బంది విషయంలోనూ ఏమాత్రం నాణ్యత పాటించని కాలేజీలు ఎక్కువగా ఉన్నట్టు తేటతెల్లమైంది. మంచి ప్రమాణాలున్న అధ్యాపకులను నియమిస్తే ఎక్కువ వేతనాలు ఇవ్వాలని, అప్పుడు విద్యార్థుల ఫీజులు పెరుగుతాయని కాలేజీల యాజమాన్యాలు అంటున్నాయి. నాక్ గుర్తింపు ఎందుకు? వివిధ రంగాల్లోని ప్రముఖులతో నాక్ ఏర్పడింది. జాతీయస్థాయిలో విద్యా ప్రమాణాలను అంచనా వేసేందుకు ఇది తోడ్పడుతుంది. ప్రధానంగా ఏడు అంశాలను నాక్ గుర్తింపు ప్రామాణికంగా తీసుకుంటుంది. పాఠ్య ప్రణాళిక రూపకల్పన, అమలు; విద్యాబోధన స్థాయి; పరిశోధన దిశగా పురోగతి; మౌలిక సదుపాయాలు; విద్యార్థి పురోగతి; ఆ సంస్థకు ఉన్న విశ్వసనీయత; అత్యుత్తమైన ప్రమాణాల అమలు అనే అంశాలను నాక్ పరిశీలిస్తుంది. వీటి ఆధారంగా మార్కులు, గ్రేడ్లు ఇస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటకతో పోలిస్తే తెలంగాణ ఈ విషయంలో వెనుకబడే ఉందని నాక్ నివేదిక స్పష్టం చేస్తోంది. ‘ఎ’గ్రేడ్‌లో కేవలం 11 సంస్థలుంటే.. ‘బి’గ్రేడ్‌లో 71 సంస్థలు, మిగతావి ‘సి’గ్రేడ్‌లో ఉన్నాయి. నాక్ గుర్తింపు పొందిన సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొన్ని నిధులు కూడా అందుతాయి. గుర్తింపు కోసం వస్తే రూ.లక్ష నజరానా తగిన ప్రమాణాలు పాటించి నాక్ గుర్తింపు కోసం విద్యా సంస్థలు పోటీపడేలా ఉన్నత విద్యామండలి ప్రయత్నిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించబోతున్నాం. నాక్ గుర్తింపు కోసం అర్హతలతో వస్తే రూ.లక్ష నజరానా ఇవ్వాలని నిర్ణయించాం. గ్రామీణ ప్రాంతాల్లోనే డిగ్రీ కాలేజీలు ఉండటం వల్ల మౌలిక సదుపాయాల మెరుగు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మంది విద్యార్థులతో నడిపే కాలేజీల సంఖ్యలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
ఫిట్నెస్ వేటలో రోహిత్ శర్మ
బెంగళూరు : ‘రోహిత్ శర్మ 70 శాతం ఫిట్నెస్తో మాత్రమే ఉన్నాడు’...ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్య ఇది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు మాత్రమే ఎంపిౖMðన రోహిత్ ఫిట్‌నెస్‌పై సందిగ్ధత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎల్ ముగిసిన వారం రోజుల తర్వాత రోహిత్ శర్మ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లోకి అడుగు పెట్టాడు. గాయాలపాలైన భారత క్రికెటర్లకు ఇది పునరావాస కేంద్రం. బోర్డు వైద్యుల పర్యవేక్షణలో కోలుకోవడంతో పాటు ఆటగాళ్లు తమ ఫిట్నెస్ కూడా ఇక్కడే నిరూపించుకోవాల్సి ఉంటుంది. పేసర్ ఇషాంత్ శర్మ ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. రోహిత్ ఫిట్నెస్ పరీక్షకు హాజరయ్యేందుకు ఇక్కడకు వచ్చాడా.. నిజంగా కండరాల గాయంతో బాధపడుతూ కోలుకునేందుకు వచ్చాడా అనే విషయంపై స్పష్టత లేదు. అయితే రోహిత్ పూర్తి ఫిట్‌గా లేడనేది మాత్రం వాస్తవం. అతను బోర్డు హెచ్చరికను ఖాతరు చేయకుండా అదే గాయంతో ఐపీఎల్లో మూడు మ్యాచ్‌లు కూడా ఆడాడు. చీఫ్ సెలక్టర్ సునీల్ జోషి పర్యవేక్షణలో రోహిత్ ఎన్సీఏలో తన ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. పుజారా కూడా ... ఆస్ట్రేలియా గడ్డపై భారత క్రికెటర్ల సన్నాహకాలు జోరుగా సాగుతున్నాయి. టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కూడా గురువారం తన ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. జట్టు ప్రధాన బౌలర్లు ఉమేశ్ యాదవ్, అశ్విన్‌లతో పాటు నెట్ బౌలర్లుగా వెళ్లిన ఇషాన్ పొరేల్, కార్తీక్ త్యాగి విసిరిన బంతులను పుజారా సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ ఆడే అవకాశం రాని పుజారా చివరి సారిగా మార్చిలో సౌరాష్ట్ర తరఫున రంజీ ట్రోఫీ ఫైనల్లో బరిలోకి దిగాడు. సాధనలో పుజారా తనదైన శైలిలో కొన్ని చక్కటి షాట్లు ఆడుతుండటం బీసీసీఐ పెట్టిన వీడియోలో కనిపించింది. మరో వైపు కరోనా బారిన పడి భారత జట్టుతో పాటు వెళ్లలేకపోయిన త్రో డౌన్ స్పెషలిస్ట్ రఘు కోలుకొని ఇప్పుడు ఆసీస్ గడ్డపై అడుగు పెట్టాడు. నిబంధనల ప్రకారం రెండు వారాల క్వారంటైన్ తర్వాత అతను టీమిండియా ప్రాక్టీస్‌లో భాగమవుతాడు. -
బీటెక్ కాంట్రాక్టర్ కావాలంటే ఏం చేయాలి..?
-
బీటెక్ కాంట్రాక్టర్
ఇంజనీరింగ్ పూర్తయిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కాంట్రాక్టర్లుగా ఎదిగేందుకు ప్రభుత్వ ప్రోత్సాహం కాంట్రాక్టు పనులపై న్యాక్ ద్వారా శిక్షణ ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా రాయితీలు త్వరలో 200 మందితో తొలి బ్యాచ్ ప్రారంభం సాక్షి, హైదరాబాద్ కాంట్రాక్టర్ కావాలంటే ఏం చేయాలి..? చేతిలో దండిగా డబ్బులుండాలి.. నిర్మాణ పనులు చేయగలిగే సామర్థ్యం ఉండాలి.. పనులు పొందగలిగే పలుకుబడి ఉండాలి! ఇది సర్వత్రా వ్యక్తమయ్యే అభిప్రాయం. కానీ దీనికి భిన్నంగా.. బీటెక్ పూర్తికాగానే నేరుగా కాంట్రాక్టర్ అయ్యేలా ప్రభుత్వమే ప్రోత్సహించబోతోంది. అయితే దీన్ని ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే పరిమితం చేసింది. వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు శిక్షణ ఇచ్చే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) ఇందులో కీలక భూమిక పోషించనుంది. ఇప్పటివరకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకే పరిమితమైన న్యాక్ తాజాగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తరగతులకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ రంగంలో గతంలో కొన్ని శిక్షణ తరగతులు నిర్వహించినా అవి తాత్కాలికంగానే కొనసాగాయి. ఇప్పుడు పూర్తిస్థాయిలో శిక్షణలు ప్రారంభించబోతోంది. తొలి విడతలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు కాంట్రాక్టుల్లో నైపుణ్యం కల్పించేందుకు ప్రత్యేక తరగతులకు శ్రీకారం చుడుతోంది. మూడు నెలల శిక్షణ రోడ్లు, భవనాలు, ఇతర ప్రాజెక్టుల్లో కాంట్రాక్టులు పొందటంలో ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. తెలంగాణ ఆవిర్భవించిన తొలినాళ్లలోనే ఈ మేరకు ప్రభుత్వం ఓ ఉత్తర్వు కూడా జారీ చేసింది. కానీ అది ఆచరణలోకి రాలేదు. ఇప్పుడు దాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు న్యాక్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. బీటెక్ పూర్తి అయిన ఎస్సీ, ఎస్టీ ఔత్సాహికులు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. మూడు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ద్వారా కాంట్రాక్టు పనులు నిర్వహించే విషయంలో వారికి న్యాక్ మెళకువలు నేర్పుతుంది. కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత సొంతంగా కాంట్రాక్టులు పొందేందుకు వారికి అర్హత లభిస్తుంది. సాధారణంగా ఆర్థికంగా స్థితిమంతులే కాంట్రాక్టులను పొందటం కద్దు. కానీ దానితో సంబంధం లేకుండా పేద ఎస్సీ, ఎస్టీ యువకులు కాంట్రాక్టులు పొందేలా ప్రభుత్వం కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు కల్పించనుంది. న్యాక్ ద్వారా శిక్షణ పొంది కాంట్రాక్టుల్లో పాల్గొనే వారికి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. రుసుములు, ధరావతులు, ఇతర కొన్ని నిబంధనల నుంచి వారికి సడలింపు ఇవ్వాలని నిర్ణయించింది. తొలుత 200 మందితో ఓ బ్యాచ్‌ను త్వరలో న్యాక్ ప్రారంభించబోతోంది. -
మన ‘న్యాక్’ ఘనత
- జాతీయ శిక్షణ కేంద్రంగా ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం - ‘పీఎం కౌశల్ వికాస్ యోజన’ అభ్యర్థులకు శిక్షణ ఇక్కడే - అభ్యర్థులను పంపేందుకు ఆసక్తి చూపుతున్న విదేశాలు - దక్షిణాఫ్రికా, భూటాన్ బృందాలకు ట్రైనింగ్ పూర్తి - ఈ నెలలో ఒప్పందం కుదుర్చుకోనున్న నైజీరియా సాక్షి, హైదరాబాద్: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్) అరుదైన ఘనత సాధించింది. నిర్మాణ రంగానికి అవసరమైన అంశాల్లో మెరుగైన శిక్షణ ఇస్తున్న కేంద్రంగా గుర్తింపు పొందింది. ఒకేసమయంలో ఇటు జాతీయ స్థాయిలో, మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో ఈ సంస్థ సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించటం ద్వారా ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ‘ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన’ పథకానికి జాతీయ స్థాయి శిక్షణా కేంద్రంగా న్యాక్ ఎంపికైంది. మరోవైపు.. హైదరాబాద్ న్యాక్‌లో నాణ్యమైన శిక్షణ ఇస్తున్నట్టు అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుండటంతో విదేశీ విద్యార్థులకు కూడా శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. జాతీయ స్థాయి శిక్షణ కేంద్రంగా ఎంపిక కేంద్రం కొత్తగా ప్రారంభించిన ‘ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన’ పథకానికి న్యాక్ శిక్షణ కేంద్రంగా అవతరించింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఎంపికైన యువతకు హైదరాబాద్‌లోని ‘న్యాక్’లోనే శిక్షణ ఇస్తారు. గతంలో ‘దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన’ పథకం కింద దేశవ్యాప్తంగా యువతకు శిక్షణ ఇచ్చిన సంస్థల్లో హైదరాబాద్ ‘న్యాక్’ తొలిస్థానాన్ని పొందటంతో.. కొత్త పథకానికి ఏకైక శిక్షణ సంస్థగా కేంద్రం న్యాక్‌ను ఎంపిక చేయటం విశేషం. దీనికింద ఏటా 5 వేల మంది యువతకు ఇక్క డ శిక్షణ ఇవ్వనున్నారు. దీన్ని మరింత విస్తరించి ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చేలా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద న్యాక్ భారీగా ఆదాయాన్ని పొందబోతోంది. శిక్షణ పొందే ప్రతి విద్యార్థి పేరుతో కేంద్రం న్యాక్‌కు రూ.14 వేలు చెల్లించనుంది. ఐదు వేల మందికి శిక్షణ ఇస్తే ఏటా రూ.7 కోట్లు సమకూరుతాయి. న్యాక్ తరహాలో దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో పనిచేసే శిక్షకుల సామర్థ్యాన్ని పెంచేందుకు హైదరాబాద్ న్యాక్‌లో శిక్షణ ఇవ్వాలని కూడా కేంద్రం నిర్ణయించటం విశేషం. ఈ నెలలో నైజీరియాతో ఒప్పందం ఇటీవలే దక్షిణాఫ్రికా యువత హైదరాబాద్ న్యాక్‌లో పొందిన శిక్షణ నాణ్యమైందిగా ఉన్నట్టు అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించటంతో ఇతర దేశాలు కూడా న్యాక్‌పై దృష్టి సారించాయి. ఇక్కడ శిక్షణ పొందిన 99 మంది దక్షిణాఫ్రికా యువత ఇటీవల ఆ దేశంలో ఫుట్‌బాల్ స్టేడియంల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవలే భూటాన్‌కు చెందిన 24 మంది ఉద్యోగులు ఇక్కడ నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందారు. నైజీరియాకు చెందిన వంద మందికి న్యాక్‌లో నిర్మాణ రంగానికి సంబంధించిన అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వీరంతా ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నవారే. నిర్మాణ రంగంలో వస్తున్న కొత్త పరిజ్ఞానానికి తగ్గట్టుగా వారి సామర్థ్యాలను పెంపొందించేందుకు న్యాక్‌కు పంపాలని నిర్ణయించిన నైజీరియా ప్రభుత్వం ఈ నెలాఖరున ఒప్పందం కుదుర్చుకోనుంది. మరికొన్ని దేశాలు కూడా న్యాక్‌ను సంప్రదిస్తున్నాయి. నాణ్యతకు ఖ్యాతి ‘‘ఇక్కడ శిక్షణ పొందిన దక్షిణాఫ్రికా విద్యార్థుల పక్షాన ఆ దేశ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేయటంతో వేరే దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. న్యాక్ నాణ్యత మెరుగ్గా ఉందనటానికి ఇదే నిదర్శనం’’ - భిక్షపతి, న్యాక్ డెరైక్టర్ జనరల్ మంచి ఉపాధికి బాటలు ‘‘న్యాక్‌లో శిక్షణ పొందిన యువతకు స్వయంగా క్యాంపస్ ఇంటర్వ్యూ ల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. పెద్దపెద్ద నిర్మాణ సంస్థలు వారిని ఎంపిక చేసుకునేందుకు పోటీపడుతున్నాయి. వారికి మెరుగైన వేతనాలు లభిస్తుండటం సంతోషంగా ఉంది’’ - శాంతిశ్రీ, ప్లేస్మెంట్ డెరైక్టర్ -
కోవెలకుంట్ల డిగ్రీ కళాశాలకు బీ డబుల్ ప్లస్ గ్రేడ్
– 2.77 పాయింట్లతో రాష్ట్రంలో మొదటి స్థానం – కళాశాల అభివద్ధికి రూ. 2 కోట్ల రూసా నిధులు కోవెలకుంట్ల: పట్టణంలోని వాసవీ బొమ్మిడాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ సంస్థ బీ డబుల్ ప్లస్ గ్రేడు ప్రకటించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ నాదం శశికళ చెప్పారు. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి ఐదేళ్లకొకసారి న్యాక్ బృందం కళాశాలను తనిఖీ చేస్తుందన్నారు. ఈ ఏడాది జులై 29, 30వ తేదీల్లో కోయంబత్తూరుకు చెందిన ప్రొఫెసర్ నటరాజన్, బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ రాధాకష్ణతో కూడిన బృందం కళాశాలను సందర్శించిందన్నారు. కళాశాలలో విద్యార్థుల చదువు, అధ్యాపకుల బోధన, విద్యార్థుల నడవడిక, పరిశోధనలు, మౌలిక సదుపాయాలు, వసతులు, కళాశాలలో విద్యపూర్తి చేసుకుని స్థిరపడిన పూర్వ విద్యార్థుల వివరాలు, కళాశాలకు పూర్వ విద్యార్థుల చేయూత, తదితర అంశాలను పరిశీలించిందన్నారు. తుది నివేదికను బెంగళూరులోని న్యాక్ కార్యాలయంలో అందజేయగా ఇటీవలే ఆ సంస్థ అధికారుల సమావేశం నిర్వహించి కళాశాలకు బీ డబుల్ ప్లస్ గ్రేడును కేటాయించనట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే అత్యధికంగా 2.77 కిమిలేటివ్ గ్రేడ్ పాయింట్లు (సీజీపీఏ) కేటాయించడంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, దాతల సమష్టి కృషితో ఉత్తమ గ్రేడు సాధ్యమైందన్నారు. కళాశాలకు బీ డబుల్ ప్లస్ గ్రేడు రావడంతో రూ. 2 కోట్ల రూసా నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ నిధులను అదనపు గదుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు వెచ్చించి కళాశాలను మరింత అభివృద్ధి చేసే అస్కారం ఉందన్నారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శివారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ‘న్యాక్’లో వద్దు
జగిత్యాల అర్బన్ : జగిత్యాల జిల్లా కలెక్టరెట్ కార్యాలయాన్ని న్యాక్ భవనంలో ఏర్పాటు చేస్తే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందని, మరోసారి పరిశీలించాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, సబ్‌కలెక్టర్ శశాంకకు వినతిపత్రం అందజేశారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ న్యాక్ భవనం జగిత్యాలకు 10కిలోమీటర్ల దూరంలో ఉండడంతోపాటు రహదారి సౌకర్యం సరిగ్గా లేదన్నారు. అంతేకాకుండా న్యాక్ విద్యార్థులకు సైతం ఇబ్బందికరంగా మారుతుందని పేర్కొన్నారు. ధరూర్ క్యాంపులో సుమారు 100 ఎకరాలు అందుబాటులో ఉందని, అక్కడ ఉన్న క్వాటర్స్‌లోనే కలెక్టరేట్‌ను ఏర్పాటు చేస్తే అందరికీ అనువుగా ఉంటుందని వివరించారు. ఎస్సారెస్పీ సర్కిల్ ఆఫీసులోనే 200 మంది వరకు విధులు నిర్వహించే అవకాశం ఉందన్నారు. ప్రజల సౌకర్యార్థం మరోసారి ఆలోచించి కలెక్టర్ కార్యాలయాన్ని ఎస్సారెస్పీ క్వాటర్లలో ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండ శంకర్, దామోదర్‌రావు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఏయూలో NAC పర్యటన
-
బడ్జెట్‌పై రెండో రోజూ కేసీఆర్ కసరత్తు
- ఆర్థిక మంత్రి ఈటెల సహా అధికారులతో భేటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ తయారీపై వరుసగా రెండో రోజు కూడా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమీక్ష నిర్వహించారు. తొలి బడ్జెట్ తరహాలో కాకుండా వాస్తవాలను ప్రతిబింబించేలా బడ్జెట్‌కు రూపకల్పన చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే గతేడాదితో పోలిస్తే ఇంచుమించు అదే స్థాయిలో బడ్జెట్‌ను రూపొందించాలని సూచించారు. ఆదివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఉన్న న్యాక్‌లో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఆ విభాగం ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, సలహాదారు జీఆర్ రెడ్డితోపాటు ఇతర అధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు. వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి నిధుల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ పథకాలకు నిధుల కేటాయింపులు, కేజీ టూ పీజీ, డబుల్ బెడ్రూం పథకాలకు సంబంధించిన అంశాలు ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది. కేంద్ర బడ్జెట్ వెలువడటంతో రాష్ట్రానికి వచ్చే నిధులపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లోనే తుది కసరత్తును పూర్తి చేసి బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దాలని నిర్ణయించారు. అన్ని విభాగాల కార్యదర్శులతో సమావేశమై శాఖాపరమైన కేటాయింపులపై తుది నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ భావించినా ఆదివారం జరిగిన చర్చలను ఆర్థికశాఖ అధికారులకే పరిమితం చేశారు. మార్చి 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటం తెలిసిందే. -
న్యాక్ నాదే.. కాదు నాదే...
సాక్షి, హైదరాబాద్: జాతీయ నిర్మాణ అకాడమీ(నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్-న్యాక్) నాదంటే నాదే అంటూ ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పోటాపోటీ చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ విషయంలో ప్రస్తుతానికైతే తెలంగాణ ప్రభుత్వం పైచేయి సాధించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. న్యాక్ సొసైటీ చట్టం కింద రిజిష్టర్ అయింది. న్యాక్‌కు ఏపీ ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉంటారు. మిగతా డెరైక్టర్లను ముఖ్యమంత్రి నామినేట్ చేస్తారు. అయితే విభజన చట్టంలోని ఏ షెడ్యూల్లోనూ దీనిని చేర్చలేదు. దీంతో స్థానిక త ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం న్యాక్ డెరైక్టర్ జనరల్(డీజీ)గా ఆర్ అండ్ బీ ఈఎన్సీ భిక్షపతిని నియమించింది. ఆలస్యంగా మేలుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ న్యాక్ డెరైక్టర్ జన రల్‌గా రహదారులు-భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి శాంబాబ్‌ను నియమించింది. అయితే శాంబాబ్ బాధ్యతలు చేపట్టడానికి న్యాక్‌కు వెళ్లగా పోలీసులు అడ్డుకుని వెనక్కు పంపించేశారు. అప్పటినుంచి ఇరురాష్ట్రాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. న్యాక్‌కు చెందిన రికార్డులతోపాటు రూ.25 కోట్లు తెలంగాణ డెరైక్టర్ జనరల్ అధీనంలోకి వెళ్లిపోయాయి. అంతేగాక తెలంగాణ సీఎంకోసం ప్రత్యేకంగా రూ.40 లక్షల వ్యయంతో కార్యాలయం నిర్మాణాన్ని కూడా న్యాక్‌లో చేపట్టారు. సీఎం కే సీఆర్ సైతం పలుసార్లు అక్కడికెళ్లి ముఖ్యమైన అంశాలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా గత రెండు నెలలుగా ఆంధ్రాకు చెందిన 374 న్యాక్ ఉద్యోగులకు జీతాలందట్లేదు. వీరంతా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నవారే. దసరా పండుగ సమయంలో ఆంధ్రా ఉద్యోగులు వేతనాలకోసం ఆందోళన చెందడంతో అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించింది. అయితే గత నెల వేతనాలను ఇంతవరకూ చెల్లించలేదు. దీనిపై న్యాక్‌కు చెందిన ఆంధ్రా అధికారులను వివరణ కోరగా న్యాక్ డబ్బులు తెలంగాణ డీజీ అధీనంలో ఉన్నాయని, రికార్డులూ ఆయన అధీనంలోనే ఉన్నందున వేతనాలు ఇవ్వట్లేదని తెలిపారు. మరోవైపు న్యాక్‌లో పనిచేస్తున్న ముగ్గురు డెరైక్టర్లను తెలంగాణ డీజీ రాజమండ్రి న్యాక్ యూనిట్‌కు బదిలీ చేశారు. అంతేగాక న్యాక్‌లో వారి కార్యాలయాలకు తాళాలు వేయించేశారు. రాజమండ్రిలో డెరైక్టర్ పోస్టులు లేనేలేవు. దీంతో రహదారులు-భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి శాంబాబ్ తెలంగాణ డీజీ చేసిన బదిలీలు చెల్లవంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు అయితే రద్దు చేశారు తప్ప ఆ డెరైక్టర్లు న్యాక్‌కు వెళ్లి పనిచేసే పరిస్థితి లేదు. దీంతో వారు సచివాలయంలో తిరుగుతున్నారు. రాష్ట్ర విభజనకు ముందే అప్పటి న్యాక్ డెరైక్టర్ జనరల్ అగర్వాల్.. న్యాక్‌ను విభజించరాదని నాటిప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే అప్పటి సీఎస్ శ్రీకాకుళం నుంచి తెలంగాణ వరకు న్యాక్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని, దీనిని పదవ షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. అయినా ఇంతవరకూ కేంద్రం నుంచి స్పందన లేదు.