చంద్ర మౌళీశ్వరునికి నాగాభరణం
నల్లజర్ల: నల్లజర్లలోని శ్రీచక్ర సహిత ఉమా చంద్ర మౌళీశ్వరస్వామికి నల్లజర్లకు చెందిన భక్తుడు కంఠమణి శ్రీనివాసరావు రూ.2లక్షల విలువైన నాలుగు కిలోల వెండితో చేయించిన నాగాభరణాన్ని బహూకరించారు. ఆదివారం ఆలయ అర్చకులు గౌడు కామేశ్వర శర్మ, మణికంఠ సాయిశర్మకు నాగాభరణాన్ని అందజేసి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు.