13కిలోల వెండితో ఉడాయించిన సేలం కార్మికుడు | gone to salam labour | Sakshi
Sakshi News home page

13కిలోల వెండితో ఉడాయించిన సేలం కార్మికుడు

Published Mon, Aug 1 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

gone to salam labour

మెట్‌పల్లి : మెట్‌పల్లి పట్టణంలోని లక్ష్మీ జువెల్లర్స్‌ యజమాని ఇల్లెందుల కిషన్‌ నుంచి అభరణాలు తయారీకోసం 13కిలోల వెండిని తీసుకుని ఓ వ్యక్తి కుటుంబంతో సహా ఉడాయించాడు. పోలీసుల కథనం ప్రకారం.. తమిళునాడు రాష్ట్రం సేలంకు చెందిన సుబ్రమణ్యం రెండు సంవత్సరాల క్రితం మెట్‌పల్లికి వచ్చాడు. ఇక్కడ పట్టగొలుసులు తయారుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం కిషన్‌ పట్టగొలుసుల కోసం 13 కిలోల వెండిని అతనికి ఇచ్చాడు. పుష్కరస్నానం కోసం సుబ్రమణ్యం కుటుంబంతో ధర్మపురికి వెళ్తుతున్నానని చెప్పి వెళ్లాడు. తిరిగి సోమవారం సాయంత్రం వరకు వస్తానని రాలేదు. దీంతో కిషన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సుబ్రమణ్యం కుటుంబంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్‌ తెలిపారు. వెండి విలువ రూ.6.30లక్షల వరకు ఉంటుందని కిషన్‌ వాపోయాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement