gone
-
పేదరికం పై పైకి!
యూకేను దెబ్బతీసిన కోవిడ్, యుద్ధాలు ప్రపంచదేశాలన్నింటి మాదిరిగానే యూకే కూడా కోవిడ్ వల్ల ఇబ్బందులు పడింది. ఇక అఫ్గానిస్తాన్ యుద్ధం, ప్రస్తుత రష్యా–ఉక్రెయిన్ల మధ్య నడుస్తున్న యుద్ధం వల్ల కూడా ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగింది. ఫలితంగా జీవన వ్యయం పెరిగిపోయింది. దీని ప్రభావం యూకేపై కూడా పడింది. – గారెత్ ఓవెన్, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్, హైదరాబాద్ (కంచర్ల యాదగిరిరెడ్డి): కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని రకరకా లుగా మార్చేసిందనడంలో సందేహం లేదు! ప్రజల జీవనశైలి, ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉద్యోగాల తీరుతెన్నులు మారిపోయాయి. కొందరికి కొత్త ఉద్యోగాలు వస్తే.. ఇంకొందరికి ఉన్నవి ఊడిపోయాయి. ఉద్యోగాలు ఉన్నా వేతనాలు తగ్గా యి. ముఖ్యంగా ప్రపంచం మొత్తమ్మీద పేదరికం పెరిగింది. ప్రపంచ బ్యాంకు మొదలుకొని అనేక అంతర్జాతీయ సంస్థలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. మరి ఎందుకు పేదరికం పెరిగింది? ఎలా పెరిగింది? ఎందరు పేదలుగా మారిపోయారు? పేదరికం పెంచిన కోవిడ్ కోవిడ్ మహమ్మారి కారణంగా అనేక మంది ఆదాయాలు పడిపోయాయని, ఫలితంగా దేశంలో 10 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువకు చేరారని తాజా లెక్కలు చెబుతున్నాయి. అయితే పేదరికం పెరగడం అనేది కోవిడ్ వల్ల మాత్రమే జరిగిన పరిణామం కాదని, లెక్కలు తప్పడం వల్ల నిన్నమొన్నటివరకూ పేదల సంఖ్య స్పష్టంగా ప్రపంచానికి తెలియలేదని ప్రపంచ బ్యాంకు అంటోంది. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో జీవన వ్యయాన్ని లెక్కవేయడంలో జరిగిన పొరపాట్ల కారణంగా పేదలు తక్కువగా ఉన్నట్లు కనిపించిందని, వాస్తవానికి వీరి సంఖ్య చాలా ఎక్కువని, గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా కోవిడ్ వచ్చిపడటంతో పేదరికం మరింత పెరిగిపోయిందని చెబుతోంది. ఉద్యోగాలు, ఆదాయంపై ప్రభావం కోవిడ్ మహమ్మారి సమయంలో చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోవడం తెలిసిందే. అయితే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అంచనాల ప్రకారం ఇది కేవలం ఉద్యోగాలు కోల్పోవడానికి మాత్రమే పరిమితం కాలేదు. చాలామందికి ఆదాయం తగ్గింది. మరికొంతమంది ఇళ్లూ కోల్పోయారు. ఫలితంగా పేదరికమూ పెరిగింది. పేదల్లోని దిగువ 40 శాతం మందికి 2021లో సగటు ఆదాయం 6.7 శాతం తగ్గిందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్యయనం తేల్చింది. అదే సమయంలో ధనికులైన 40 శాతం మందిలో ఈ తగ్గుదల కేవలం 2.8 శాతం మాత్రమే. కోవిడ్ దెబ్బ నుంచి కోలుకోలేకపోవడం పేదల ఆదాయం తగ్గేందుకు కారణమైంది. అయితే ధనికుల్లో సగం మంది తమ కష్టాల నుంచి బయటపడటం గమనార్హం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిస్కల్ స్టడీస్ ప్రకారం యూకేలో కోవిడ్ దాదాపు ఏడు లక్షల మందిని పేదరికంలోకి నెట్టేసింది. కోవిడ్‌కు ముందు జనాభాలో 15 శాతం మంది పేదరికంలో మగ్గుతుండగా.. తదనంతర పరిస్థితుల్లో ఇది 23 శాతానికి చేరుకోవడం గమనార్హం. అమెరికన్ సెన్సస్ బ్యూరో అంచనాల ప్రకారం 2021లో పేదరికంలో ఉన్న జనాభా 11.6 శాతం. అంటే సుమారు నలభై లక్షల మంది. అయితే కోవిడ్ ముట్టడించిన 2020తో పోలిస్తే ఇందులో పెద్దగా తేడా ఏమీ లేకపోవడం ఆసక్తికరమైన అంశం. యూరప్ విషయానికి వస్తే, చాలా దేశాల్లో నిరుద్యోగ సమస్య బాగా ఎక్కువైంది. యూరోపియన్ కమిషన్ ప్రాంతంలో సుమారు కోటీ ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు డిబేటింగ్ యూరప్ సంస్థ చెబుతోంది. ఉద్యోగాల్లో ఉన్నవారిలోనూ మూడొంతుల మంది వేతనాలు తగ్గాయి. దీంతో ఇక్కడ కూడా పేదరికం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా లెక్క అలా.. మనది ఇలా రోజుకు 1.90 డాలర్లు లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన వారందరూ పేదలే అని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. కోవిడ్ కంటే ముందు ఇంతకంటే ఎక్కువ ఆదాయమున్న వారు కూడా మహమ్మారి కారణంగా పేదలుగా మారిపోయారని అంటోంది. ప్రపంచ వ్యాప్తంగా పేదరికంలో ఉన్న వారి మోతాదు 7.8 శాతం నుంచి 9.1 శాతానికి చేరుకుందని లెక్క గట్టింది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం కూడు, గుడ్డ, నీడలకు కావాల్సినంత కూడా సంపాదించలేని వారే పేదలు. ఈ కనీస అవసరాలు తీర్చుకునేందుకు సగటున 1.90 డాలర్ల వరకూ ఖర్చవుతుందని అంచనా వేసింది. అయితే మన దేశంలో ఈ మూడింటితో పాటు ఆరోగ్యం, విద్య కూడా పొందలేని వారిని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిగా వర్గీకరిస్తున్నాం. భారత్‌లో పేదరికాన్ని కొలిచేందుకు ‘టెండుల్కర్ మెథడాలజీ’ని ఉపయోగిస్తారు. దీని ప్రకారం మనిషి మనుగడ సాగిచేందుకు కావాల్సిన కనిష్ట మోతాదు కేలరీలకు అయ్యే ఖర్చుతో పాటు, దుస్తులు, నివసించేందుకు పెట్టే వ్యయాన్ని బట్టి పేదలా? కాదా? అన్న వర్గీకరణ జరుగుతుంది. 2021 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 9.2 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. అయితే వీరి సంఖ్య అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేతీరున లేదు. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగానూ, కేరళ, పంజాబ్ వంటిచోట్ల తక్కువగానూ ఉంది. 2020లోనే పేదల సంఖ్య సుమారు ఏడు కోట్లకు చేరుకుందని రెండు, మూడేళ్లలోనే ఈ సంఖ్య తొమ్మిది కోట్లకు చేరుకుందని ప్రపంచ బ్యాంకు అంచనాలు చెబతున్నాయి. 16.3 కోట్ల దిగువ మధ్యతరగతి? రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువ సంపాదించే వారు పేదలైతే..5.5 డాలర్లు సంపాదించేవారిని దిగువ మధ్య తరగతి వారిగా పరిగణిస్తున్నారు. ఈ వర్గీకరణలోకి వచ్చేవారు దేశం మొత్తమ్మీద 16.3 కోట్ల మంది ఉన్నారని ప్రపంచ బ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. పేదరికంపై నడ్జ్ ఫౌండేషన్ పోరు ‘ద నడ్జ్ ఇన్స్టిట్యూట్’ 2015లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన లాభాపేక్ష లేని సంస్థ. పేదరిక నిర్మూలన మా లక్ష్యం. ప్రభుత్వం, పౌర సమాజం, కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. యువతకు వేర్వేరు అంశాల్లో నైపుణ్యాలు అందించేందుకు ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా కృషి చేస్తున్నాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదల కోసం గ్రామీణాభివృద్ధి కేంద్రం కూడా నడుపుతున్నాం. వీరికోసం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు కర్ణాటక సహా ఎనిమిది రాష్ట్రాల్లో అమలవుతోంది. సమాజ సేవ చేయాలనుకునే సీఈవో, సీఓఓలకూ అవకాశాలు కల్పిస్తున్నాం. ఇప్పటికే సుమారు 30 మంది సీఈవో, సీఓఓలు ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో కలిసి పనిచేస్తున్నారు. స్వయం సహాయక బృందాల్లోని సభ్యులకు వ్యక్తిగతంగా రుణాలిచ్చేందుకు, వడ్డీ సబ్సిడీలు కల్పించేందుకు ఆలోచన చేసి అమలు చేయడం వీరు సాధించిన విజయాల్లో ఒకటిగా చెప్పవచ్చు.– సుధా శ్రీనివాసన్, సీఈవో,ద నడ్జ్ ఫౌండేషన్ -
అమెరికా నుంచి తెలుగు విద్యార్థులు వెనక్కి!
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చదువుకోవడం కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి ఇమి గ్రేషన్/భద్రతా అధికారులు ఎయిర్‌పోర్టు నుంచే తిప్పిపంపేశారు. ఎందుకు పంపేస్తున్నారనే దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. బలవంతంగా విమానం ఎక్కించి వెనక్కి పంపారు. ఇలా అట్లాంటా, శాన్ఫ్రాన్సిస్కో, షికాగో ప్రాంతాల నుంచి 21 మందిని తిప్పిపంపినట్టు తెలిసింది. దాదాపు వారం రోజుల నుంచి ఇలా ఒకరిద్దరిని పంపేస్తున్నా.. ఇప్పుడు ఒక్కరోజే 20 మందికిపైగా విద్యార్థులను వెనక్కి పంపడంతో విషయం బయటికి వచ్చిందని అమెరికాలోని తెలుగు సంఘాలు చెప్తున్నాయి. అయితే పత్రాలు, వివరాలన్నీ పరిశీలించాకే అమెరికా వీసా ఇస్తారని, అలాంటప్పుడు ఈ సమస్య ఎందుకొచ్చిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సదరు విద్యార్థుల పేర్లు, ఇతర వివరాలు ఇంకా బయటికి రాలేదు.పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నా..: అమెరికాలో ఆగస్టులో విద్యా సంవత్సరం మొదలవుతుంది. దీనికి తగ్గట్టుగానే భారత విద్యార్థులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అక్కడి వీసా నిబంధనలకు అనుగుణంగా అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటారు. ముందే టోఫెల్, జీఆర్ఈ వంటి పరీక్షలు రాస్తారు. వాటి మార్కుల ఆధారంగానే అక్కడి యూనివర్సిటీలలో సీట్లు వస్తాయి. తర్వాత అమెరికాలో చదువుకున్నన్ని రోజులు జీవించడానికి అవసరమయ్యే మేర సొమ్మును బ్యాంకు బ్యాలెన్స్‌గా చూపిస్తారు. ఇందుకోసం విద్యార్థులు కన్సల్టెన్సీల సహకారం తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టుగా అనుభవం సర్టిఫికెట్లు కూడా సమర్పిస్తున్నారు. ఈ వ్యవహారంలోనే మన విద్యార్థులు ఇబ్బందుల్లో పడుతున్నారని అమెరికాలోని తెలుగు అసోసియేషన్లు చెప్తున్నాయి. డాక్యుమెంట్లపై అనుమానాలు.. సోషల్ మీడియా ఖాతాలు అమెరికాలో ‘సాక్షి’ ప్రతినిధికి అందిన సమాచారం ప్రకారం.. పలువురు తెలుగు విద్యార్థులు బ్యాంక్ ఖాతాలో సొమ్మును చూపిన అంశంపై అమెరికా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఖాతాలో ఒకేసారి భారీగా డబ్బులు పడటం, లావాదేవీలు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించి, తిప్పి పంపారు. అమెరికాలో ఆటా సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమెరికాలో ఎన్నారై వ్యవహారాల సలహాదారు డాక్టర్ వాసుదేవరెడ్డి అందించిన వివరాల ప్రకారం.. అమెరికాకు వచ్చే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను ఆ దేశ ఇమిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా పరిశీలిస్తోంది. వీసాకు అనుమతించిన మరుక్షణమే నిఘా పెడుతోంది. అందులో అమెరికా నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు, సమాచారం, వ్యాఖ్యలు ఉంటే వాటి ఆధారంగా ఎయిర్‌పోర్టులోనే ఆపేస్తున్నారు. ఉదాహరణకు భారత విద్యార్థి అమెరికా వస్తూ.. ఇక్కడి స్నేహితులతో అమెరికాలో చదువుకునే రోజుల్లో ఉండే పార్ట్‌టైం ఉద్యోగాల గురించి వాకబు చేశాడు. ఇది నిబంధనలకు విరుద్ధంగా పరిగణించి వెనక్కి పంపేశారు. నాటా ప్రతినిధి అందించిన సమాచారం ప్రకారం.. అమెరికా మన విద్యార్థులను తిప్పి పంపడానికి కారణాలను కేవలం భారత కాన్సులేట్‌కు మాత్రమే చెబుతుంది. దీనితో ఆ వివరాలు తెలుసుకునేందుకు అమెరికాలో తెలుగు అసోసియేషన్లు ప్రయత్నిస్తున్నాయి. -
చంద్రబాబుకు మైండ్ చెడిపోయింది: మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
-
కొడుకును కాపాడబోయి.. తండ్రి గల్లంతు
ఖమ్మంరూరల్ : మండలంలోని ముత్తగూడెం వద్ద నాగార్జున సాగర్ ప్రధాన కాల్వలో పడిన కుమారుడిని కాపాడబోయిన తండ్రి.. నీటిలో గల్లంతయ్యా డు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు... నల్గొండ జిల్లా మిర్యాలగూడేనికి చెందిన ఎండీ జహంగీర్(35), తన భార్య ఫర్జాన్, కుమారుడు అఫ్రోజ్, కుమార్తె సమీనతో కలిసి కొంత కాలంగా ముత్తగూడెంలో నివసిస్తున్నాడు. అక్కడే చికెన్ షాపు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం భార్యాపిల్లలతో కలిసి దుస్తులు ఉతికేందుకు సాగర్ కాల్వ వద్దకు వెళ్లాడు. అక్కడ దుస్తులు ఉతుకుతుండగా కుమారుడు అఫ్రోజ్, కాలుజారి కాల్వలో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు తండ్రి జహంగీర్ వెంటనే కాల్వలోకి దూకాడు. సరిగ్గా అదే సమయంలో కాల్వ పక్కన చేపలు పడుతున్న మత్స్యకారులు స్పందించి, ముందుగా అఫ్రోజ్‌ను బయటకు లాగారు. జహంగీర్‌ను కూడా కాపాడేందుకు ప్రయత్నించారు. అతడికి ఈత వచ్చు. కానీ, వరదఉధృతి ఎక్కువగా ఉండటంతో కొట్టుకు పోయాడు.. గల్లంతయ్యాడు. ప్రమాద స్థలాన్ని ఎస్సై ఎం.చిరంజీవి పరిశీలించారు. అప్పటికే పొద్దుపోవడంతో గాలింపు సాధ్యపడలేదు. జహంగీర్, ప్రతి రోజూ ఈ కాల్వలో ఈత కొడుతుండేవాడు. కేసును ఎస్సై నమోదు చేశారు. -
ఆశలు వర్షార్పణం
వర్షానికి దెబ్బతిన్న పంటలు గోరంట్ల, బుక్కపట్టణం మండలాల్లో అరటి, మామిడికి నష్టం బుక్కపట్టణం మండలంలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి అనంతపురం అగ్రికల్చర్: అకాల వర్షం అన్నదాతల ఆశలను చిదిమేసింది. భూగర్భజలాలు అంతంతమాత్రంగానే ఉన్న జిల్లాలో ప్రకృతికి ఎదురు నిలిచి సాగుచేసిన రైతన్నల కష్టాన్ని నేలపాలుచేసింది. మంగళవారం జిల్లాలో కురిసిన వర్షంతో పంటలకు నష్టం వాటిల్లగా..పిడుగుపాటుతో బుక్కపట్టణం మండలం కొత్తకోట గ్రామంలో జయచంద్ర (21) అనే విద్యార్థి మృత్యువాత పడ్డారు. నేల రాలిన మామిడి అకాల వర్షంతో పుట్టపర్తి మండలం వెంగలమ్మచెరువు గ్రామంలో మామిడి కాయలు నేలరాలడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 100 ఎకరాలపైగానే మామిడి పంటకు నష్టం వాటినట్లు తెలుస్తోంది. ఇక గోరంట్ల మండలం కసిరెడ్డిపల్లి గ్రామంలో ఈదురుగాలులతో కూడిన వాన పడటంతో రైతు సదాశివరెడ్డికి చెందిన కాకర పంట నాశనమైంది. మొత్తమ్మీద మంగళవారం మధ్యాహ్నం పుట్టపర్తి మండలంలో అత్యధికంగా 45 మి.మీ వర్షపాతం నమోదు కాగా రొద్దం 35 మి.మీ, పరిగి 25 మి.మీ, సోమందేపల్లి 20 మి.మీ, కొత్తచెరువు, తాడిపత్రి, గోరంట్లలో 15 మి.మీ, పెనుకొండ, తనకల్లు, పుట్లూరు మండలాల్లో 10 మి.మీ మేర వర్షపాతం నమోదైంది. ఆయా గ్రామాల్లో అరటి, మామిడి పంటలకు తీవ్ర నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ముదిగుబ్బ, చెన్నేకొత్తపల్లి, శింగనమల, నార్పల, తాడిమర్రి, బుక్కపట్టణం, మడకశిర, యల్లనూరు, చిలమత్తూరు, లేపాక్షి, ఓడీ చెరువు తదితర మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. -
లభించని కాల్వలో గల్లంతైన వ్యక్తి ఆచూకీ
– శాలిగౌరారం అలుగు కాల్వలో కొట్టుకుపోయిన పవన్‌కుమార్ – 36 గంటలుగా కొనసాగుతున్న గాలింపు చర్యలు – సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎంపీ, ఎమ్మెల్యే – బాధితుల కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎంపీ, ఎమ్మెల్యే – ఆర్డీఓ, డీఎస్పీ పర్యవేక్షణలో ముమ్మరంగా గాలింపు – వరద నియంత్రణకు గండికుంటకు జేపీబీతో రెండు చోట్ల గండ్లు శాలిగౌరారం శాలిగౌరారం ప్రాజెక్ట్ అలుగు కాలువలో గండికుంట వద్ద గల్లంతైన అమరగాని పవన్‌కుమార్(36) ఆచూకీ లభించలేదు. నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి, డీఎస్పీ సుధాకర్ పర్యవేక్షణలో సంబంధిత సిబ్బంది 36 గంటలుగా ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించలేదు. ఆదివారం రాత్రి వరకు గల్లంతైన పవన్‌కుమార్ ఆచూకీ లభించకపోవటంతో బాధిత కుటుంబీకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే శాలిగౌరారం ప్రాజెక్ట్ కుడిఅలుగు కాలువలో గండికుంట వద్ద శనివారం పవన్‌కుమార్ గల్లంతైన ప్రదేశాన్ని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సందర్శించారు. కాలువ నీటి ఉధృతిని పరిశీలించిన అనంతరం సంఘటన జరిగిన తీరుతెన్నులపై ఆర్డీఓ, డీఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. గాలింపు చర్యలు వేగవంతం చేసి గల్లంతైన పవన్‌కుమార్ ఆచూకీని తెలుసుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కాలువలో వరద ఉధృతి అధికంగా ఉండటం, కంపచెట్లు ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు ఎంపీ, ఎమ్మెల్యేకు వివరించారు. పరిస్థితిని బట్టి రిస్క్యూ టీంను రప్పించి రంగంలోకి దించాలనాలని ఆదేశించారు. సంఘటన స్థలంలో బాధిత కుటుంబీకులను ఎంపీ, ఎమ్మెల్యేలు ఓదార్చారు. గాలింపు ^è ర్యలు వేగవంతం చేసి పవన్‌కుమార్ ఆచూకీ గుర్తిస్తామని బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. వరద నియంత్రణ కోసం కుంటకు గండ్లు వరద ఉధృతి నియంత్రణ కోసం ప్రాజెక్ట్ అలుగు కాలువకు అనుసంధానంగా ఉన్న గండికుంటకు జేసీబీ సహాయంలో రెండు చోట్ల గండికొట్టారు. అదేవిధంగా కాలువకు వరద వెళ్లకుండా ఉండేందుకు ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. అయినప్పటికీ వరద నియంత్రణ కాకపోవటంతో శాలిగౌరారం ప్రాజెక్ట్‌కు గండి కొట్టేందుకు అధికారులు పరిశీలన చేశారు. దీంతో ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారని అధికారుల చర్యలను అడ్డుకున్నారు. దీంతో ప్రాజెక్ట్ వద్ద కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నీటిని తోడేందుకు ఫైరింజన్ తెప్పించినా ఫలితం లేకుండా పోయింది.దీంతో పోలీసులు ప్రత్యేక బలగాలను రప్పించి గాలింపు చర్యలు వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
బంగారు వ్యాపారి పరారీ
ధర్మవరం టౌన్ : శక్తికి మించి అప్పులు చేయడం.. ఆపై జల్సాలు చేయడం.. ఐపీ నోటీసు ఇచ్చి పరారు కావడం.. పట్టణంలో నిత్యకృత్యమవుతున్నాయి. తాజా ధర్మవరంలోని ఎస్ఎల్వీ మార్కెట్ వీధిలో బంగారు అంగడి పెట్టుకున్నS ఓ వ్యాపారి పరారయ్యాడు. రూ.2.5కోట్లు అప్పు చేసి ఐపీ నోటీసు కోర్టుకు సమర్పించాడు. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాలు.. ఎస్ఎల్వీ మార్కెట్లో బంగారు అంగడి పెట్టుకుని ఇద్దరు అన్నదమ్ములు వ్యాపారం చేస్తున్నారు. బంగారు దుకాణాన్ని ఎరగా చూపి కోట్లాది రూపాయలను తెలిసిన వారిదగ్గర అప్పుగా తీసుకున్నారు. ఆ డబ్బుతో రూ.50 లక్షలు వెచ్చించి పట్టణంలోని సత్యసాయి నగర్లో ఓ ఇళ్లు కట్టించారు. చివరకు వడ్డీలకు వడ్డీలు పెరిగి పోవడంతో ఏడాదిక్రితం ఆ ఇంటిని అమ్మివేశారు. ఇళ్లు అమ్మిన ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అదే ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రుణదాతల ఒత్తిళ్లు అధికమవ్వడంతో నెల క్రితం దుకాణానికి తాళం వేసి, పరారై కోర్టులో ఐపీ నోటీసు ఇచ్చారు. అయితే కోర్టులో ఐపీ పెట్టడానికి గల కారణాలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం ఆనోటా ఈ నోటా బాధితులకు కూడా తెలిసిపోయింది. బాధితులు తమ డబ్బు వస్తుందా రాదా..? అని మదన పడుతున్నారు. ఎలాంటి కారణం లేకుండా అప్పు ఎగ్గొట్టాలనుకునే వారిపై కఠినంగా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పట్టణంలో దాదాపు 30 మంది వద్ద నుంచి రూ.2.5కోట్లు బంగారు వ్యాపారులు అప్పు చేసినట్లుగా సమాచారం. -
13కిలోల వెండితో ఉడాయించిన సేలం కార్మికుడు
మెట్పల్లి : మెట్పల్లి పట్టణంలోని లక్ష్మీ జువెల్లర్స్ యజమాని ఇల్లెందుల కిషన్ నుంచి అభరణాలు తయారీకోసం 13కిలోల వెండిని తీసుకుని ఓ వ్యక్తి కుటుంబంతో సహా ఉడాయించాడు. పోలీసుల కథనం ప్రకారం.. తమిళునాడు రాష్ట్రం సేలంకు చెందిన సుబ్రమణ్యం రెండు సంవత్సరాల క్రితం మెట్‌పల్లికి వచ్చాడు. ఇక్కడ పట్టగొలుసులు తయారుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం కిషన్ పట్టగొలుసుల కోసం 13 కిలోల వెండిని అతనికి ఇచ్చాడు. పుష్కరస్నానం కోసం సుబ్రమణ్యం కుటుంబంతో ధర్మపురికి వెళ్తుతున్నానని చెప్పి వెళ్లాడు. తిరిగి సోమవారం సాయంత్రం వరకు వస్తానని రాలేదు. దీంతో కిషన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సుబ్రమణ్యం కుటుంబంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. వెండి విలువ రూ.6.30లక్షల వరకు ఉంటుందని కిషన్ వాపోయాడు. -
నీరాక కోసం