13కిలోల వెండితో ఉడాయించిన సేలం కార్మికుడు
మెట్పల్లి : మెట్పల్లి పట్టణంలోని లక్ష్మీ జువెల్లర్స్ యజమాని ఇల్లెందుల కిషన్ నుంచి అభరణాలు తయారీకోసం 13కిలోల వెండిని తీసుకుని ఓ వ్యక్తి కుటుంబంతో సహా ఉడాయించాడు. పోలీసుల కథనం ప్రకారం.. తమిళునాడు రాష్ట్రం సేలంకు చెందిన సుబ్రమణ్యం రెండు సంవత్సరాల క్రితం మెట్పల్లికి వచ్చాడు. ఇక్కడ పట్టగొలుసులు తయారుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం కిషన్ పట్టగొలుసుల కోసం 13 కిలోల వెండిని అతనికి ఇచ్చాడు. పుష్కరస్నానం కోసం సుబ్రమణ్యం కుటుంబంతో ధర్మపురికి వెళ్తుతున్నానని చెప్పి వెళ్లాడు. తిరిగి సోమవారం సాయంత్రం వరకు వస్తానని రాలేదు. దీంతో కిషన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సుబ్రమణ్యం కుటుంబంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. వెండి విలువ రూ.6.30లక్షల వరకు ఉంటుందని కిషన్ వాపోయాడు.