నరసింహకొండ గిరి దర్శనానికి కృషి | Narasimhakonda temple development top priority | Sakshi
Sakshi News home page

నరసింహకొండ గిరి దర్శనానికి కృషి

Published Sun, Aug 14 2016 12:24 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

నరసింహకొండ గిరి దర్శనానికి కృషి - Sakshi

నరసింహకొండ గిరి దర్శనానికి కృషి

 
నెల్లూరు(అర్బన్‌): నరసింహకొండ చుట్టూ రోడ్డును ఏర్పాటు చేసి గిరి దర్శనానికి వీలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని మాజీ మంత్రి, టీడీపీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. నరసింహకొండపై కొలువైన వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన కమిటీ నూతన చైర్మన్‌ మల్లినేని వెంకటేశ్వర్లునాయుడు, సభ్యులు దైవసన్నిధిలో శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. నరసింహస్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఆదాల మాట్లాడారు. ఆలయానికి 1348 ఎకరాల భూమి ఉందని, ఈ ఆస్తులను నూతన కమిటీ పరిరక్షిస్తూ ఆదాయ పెంపునకు కృషి చేస్తుందని చెప్పారు. భక్తులకు సౌకర్యాలను కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి మాట్లాడారు. కొండపైకి బస్సు సౌకర్యాన్ని కల్పించేలా ఆదాల ప్రభాకర్‌రెడ్డి కృషి చేయాలని కోరారు. అనంతరం ఆదాలను కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. నూతన కమిటీ సభ్యులకు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. టీడీపీ రూరల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కిలారి వెంకటస్వామినాయుడు అధ్యక్షత వహించిన సభలో పార్టీ నగరాధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి, విజయా డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, నాయకులు హరిబాబుయాదవ్, హంసకుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అసంతృప్తి
స్థానిక ఎంపీటీసీగా ఉన్న తనను వేదికపైకి ఆహ్వానించలేదని సునీల్‌ పలువురు టీడీపీ నాయకుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement