ఆత్మకూరు : మండల కేంద్రంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి వాలీబాల్ క్రీడా పోటీలు బుధవారం ముగిశాయి . పోటీల్లో మొత్తం 22 జట్లు పాల్గొనగా బుధవారం జరిగిన ఫైనల్‌లో నార్పల, మా డాబా జట్లు తలపడ్డాయి. ఈ జట్లకు ఫైనల్‌లో మూడు మ్యాచ్‌లు నిర్వహించగా నార్పల జట్టు రెండుసార్లు గెలిచి విజేతగా నిలిచింది. విజేతలకు తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ ఆదినారాయణ, ఎస్‌ఐ ధరణి కిషోర్ బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా డాబా ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వాలీబాల్ క్రీడలు నిర్వహించిన ప్రశాంత్‌రెడ్డి, ఓబుళపతిని అభినందించారు. కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ కొండారెడ్డి , నిర్వాహకులు ఫణిరెడ్డి, సద్దికూటి వెంకట్రామిరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి , భారతీ సిమెంట్ నిర్వాహకుడు తైదుల శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వాలీబాల్ విజేత నార్పల
Published Wed, Mar 1 2017 9:41 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM
Advertisement
Advertisement