వాలీబాల్‌ టోర్నీకి సన్నాహాలు | prepare to volley ball tourny | Sakshi
Sakshi News home page

వాలీబాల్‌ టోర్నీకి సన్నాహాలు

Published Wed, Jun 7 2017 11:15 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

వాలీబాల్‌ టోర్నీకి సన్నాహాలు - Sakshi

వాలీబాల్‌ టోర్నీకి సన్నాహాలు

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 11 వరకు నగరంలోని నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో నిర్వహించే రాష్ట్రస్థాయి టోర్నీకి సన్నాహాలు చేస్తున్నారు. అసోసియేషన్‌ సభ్యులు క్రీడా మైదానంలో కోర్టు ఏర్పాటు చేసే పనులను వేగవంతం చేశారు. అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి కొండారెడ్డి మాట్లాడుతూ ఈ టోర్నీకి రాష్ట్రంలోని 16 జట్లు పాల్గొంటాయన్నారు. మొదటిసారి ఫ్లడ్‌లైట్ల వెలుగులో టోర్నీని నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో కోచ్‌ జబీర్, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement