volley ball tourny
-
విజేత అనంత హాస్పిటల్ జట్టు
అనంతపురం సప్తగిరిసర్కిల్ : రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీ విజేతగా అనంతపురం హాస్పిటల్ జట్టు నిలిచింది. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 9 నుంచి 11 వరకు నగరంలోని నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ఫైననల్ పోరులో అనంతపురం ఎస్ఆర్ స్టేడియం, అనంతపురం హాస్పిటల్ జట్లు తలపడ్డాయి. మొదటి సెట్‌ను అనంతపురం ఎస్ఆర్ స్టేడియం జట్టు గెలుచుకోగా, రెండవ సెట్‌ను అనంతపురం హాస్పిటల్ జట్టు గెలుచుకుంది. చివరి సెట్ పోటీ హోరాహోరీగా సాగింది. ప్రతి సర్వీస్‌లోనూ ఇరు జట్లు సమాన పాయింట్లు సాధించాయి. చివరికి హాస్పిటల్ జట్టు రెండు పాయింట్ల తేడాతో విజయం నమోదు చేసింది. దీంతో ఈ టోర్నీలో మొదటిస్థానంలో అనంతపురం హాస్పిటల్, రెండవస్థానంలో అనంతపురం ఎస్ఆర్ స్టేడియం, మూడవ స్థానంలో వైఎస్సార్ కడప, నాల్గవ స్థానంలో పామిడి జట్లు నిలిచాయి. విజేత జట్లకు వరుసగా రూ.20వేలు, రూ.15వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున నగదు బహుమతులు అందజేశారు. గెలుపోటములను సమానంగా తీసుకోవాలి –ట్రాఫిక్ డీఎస్పీ నరసింగప్ప క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకుని ముందుకు సాగాలని ట్రాఫిక్ డీఎస్పీ నరసింగప్ప తెలిపారు. విజేత జట్లకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ట్రాఫిక్ డీఎస్పీతోపాటు డీఎస్డీఓ బాషామోహిద్దీన్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణరెడ్డి, షిర్డీ సాయి స్వీట్స్ ప్రొప్రైటర్ భవానీ రవికుమార్, సీఐలు తబ్రేజ్, రియాజ్, సీనియర్ ప్లేయర్లు మోహన్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, అల్లాబకాష్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వన్‌టౌన్ సీఐ సాయిప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో జిలా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి కొండారెడ్డి, కొగటం విజయభాస్కర్‌రెడ్డి, కోచ్‌లు మనోహర్‌రెడ్డి, జీవన్, జబీర్, ప్రవీణ్‌కుమార్, గౌడ్, మంజుల, రామాంజినేయులు, రమేష్, ఎస్ఎస్బీఎన్ పీడీ చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
వాలీబాల్ టోర్నీకి సన్నాహాలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 11 వరకు నగరంలోని నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో నిర్వహించే రాష్ట్రస్థాయి టోర్నీకి సన్నాహాలు చేస్తున్నారు. అసోసియేషన్ సభ్యులు క్రీడా మైదానంలో కోర్టు ఏర్పాటు చేసే పనులను వేగవంతం చేశారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కొండారెడ్డి మాట్లాడుతూ ఈ టోర్నీకి రాష్ట్రంలోని 16 జట్లు పాల్గొంటాయన్నారు. మొదటిసారి ఫ్లడ్‌లైట్ల వెలుగులో టోర్నీని నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో కోచ్ జబీర్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
‘ఏప్రిల్ 14 నుంచి వాలీబాల్ టోర్నీ’
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని బంజారాలకు జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నీని ఏప్రిల్ 14 నుంచి నిర్వహిస్తున్నట్లు సేవాలాల్ ట్రస్ట్ అర్బన్ అధ్యక్షులు మహేష్‌నాయక్ తెలిపారు. స్థానిక లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని అండర్–25 వాలీబాల్ టోర్నీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ టోర్నీని వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పెద్దతండాలోని ఆర్డీటీ పాఠశాలలో ఏప్రిల్ 14 నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గల వారు తమ జట్ల పేర్లను ఏప్రిల్ 10లోగా నమోదు చేసుకోవాలన్నారు. గెలుపొందిన జట్లకు మొదటి బహుమతిగా రూ.10116, రెండవ బహుమతిగా రూ.5116 ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. వివరాలకు 9492222233, 9652427520 నెంబరుకు సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పరమేష్‌నాయక్, సుబ్రహ్మణ్యం నాయక్, వెంకటరమణ, రాజు, వినోద్, గోపాల్, శీనానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వాలీబాల్ విజేత నార్పల
ఆత్మకూరు : మండల కేంద్రంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి వాలీబాల్ క్రీడా పోటీలు బుధవారం ముగిశాయి . పోటీల్లో మొత్తం 22 జట్లు పాల్గొనగా బుధవారం జరిగిన ఫైనల్లో నార్పల, మా డాబా జట్లు తలపడ్డాయి. ఈ జట్లకు ఫైనల్లో మూడు మ్యాచ్‌లు నిర్వహించగా నార్పల జట్టు రెండుసార్లు గెలిచి విజేతగా నిలిచింది. విజేతలకు తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ ఆదినారాయణ, ఎస్ఐ ధరణి కిషోర్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా డాబా ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వాలీబాల్ క్రీడలు నిర్వహించిన ప్రశాంత్‌రెడ్డి, ఓబుళపతిని అభినందించారు. కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ కొండారెడ్డి , నిర్వాహకులు ఫణిరెడ్డి, సద్దికూటి వెంకట్రామిరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి , భారతీ సిమెంట్ నిర్వాహకుడు తైదుల శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.