జాతీయ కరాటే పోటీల్లో పతకాలు
Published Tue, Jul 26 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా రెడ్డి జనసంఘ్ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం జరిగిన 3వ జాతీయస్థాయి కరాటే పోటీల్లో జిల్లా క్రీడాకారులు తొమ్మిది పతకాలు సాధించారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక జిల్లా పరిషత్ మైదానంలో క్రీడాకారులను జిల్లా కరాటే అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, జిల్లా అ««దl్యక్షుడు కృష్ణయ్యగౌడ్ అభినందించారు. జాతీయస్థాయి కరాటేలో జిల్లా క్రీడాకారులు మంచి నైపుణ్యం ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు. మార్షల్ ఆర్ట్స్‌కు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇచ్చి, కరాటే మాస్టర్లకు ఉపాధి కల్పించాలని కోరారు. రాష్ట్ర పాఠశాలల క్రీడల కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు ఎతినె చెన్నయ్య మాట్లాడుతూ జపాన్ కరాటే అసోసియేషన్ షోటోకాన్ ఆధ్వర్యంలో క్రీడాకారులు శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు.
జాతీయస్థాయి కరాటే బ్లాక్‌బెల్టు విభాగంలో రమేశ్‌రాథోడ్ (నవాబ్‌పేట) స్పైరింగ్, ఓంకార్ (షాద్‌నగర్) కతాస్‌లో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నట్లు తెలిపారు. మహిళల బ్లాక్‌బెల్టులో యశోధ (మహబూబ్‌నగర్), జూనియర్స్‌లో భూత్పుర్ కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు లత ప్రథమ, శిరీష, సంధ్య ద్వితీయ, సబ్ జూనియర్ విభాగంలో మోహన్ శ్రీకాంత్, శివప్రసాద్‌లు మొదటి మూడుస్థానాల్లో నిలిచి పతకాలు పొందినట్లు తెలిపారు. వీరికి మెమోంటోలు, సర్టిఫికెట్లు అందజేసినట్లు వెల్లడించారు. క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement