ఉనికి కోసమే జాతీయ సంఘాల ఆరాటం
► టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య
రామగిరి(సెంటినరీకాలనీ) : జాతీయ కార్మిక సంఘాలు ఉనికి కోసం ఆరాట పడుతున్నాయని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య అన్నారు. శుక్రవారం ఆర్జీ–3 డివిజన్ పంచ్‌ఎంట్రీలో ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లక్రితం జాతీయ సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగ హక్కును టీబీజీకేఎస్ యూని యన్ సాధించడంతో వారి ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నార. అందుకే లేని పోని విమర్శలు చేస్తున్నారన్నారు. జాతీయ సంఘాలకు కార్మికులపై ప్రేమ ఉంటే వేజ్ బోర్డు లో మెరుగైన వేతనాల అమలుకు కృషి చేయాలన్నారు. దీపాళి బోనస్, మూడేళ్లకోసారి పెంచాల్సిన పెన్షన్ ఎందుకు పెంచలేకపోయారో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో వీఆర్‌ఎస్ కార్మికులకు యాజమాన్యంతో కుమ్మక్కై రూ. 2 లక్షలు ఇప్పించి కార్మికులను మోసం చేశారని ఆరోపించారు.
కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా టీబీజీకేఎస్ ఎన్నో హక్కులు సాధించిందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. అనంతరం యూనియన్ లో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు ముద్దసాని రఘువీర్‌రెడ్డి, నాగెల్లి సాంభయ్య, కొట్టె భూమయ్య, ఇస్సంపెల్లి రమేశ్, పర్శ బక్కయ్య, వేగోలపు మల్లయ్య, దేవ శ్రీనివాస్, బత్తుల రమేశ్, రౌతు రమేశ్, గాజుల తిరుపతి, వీవీగౌడ్, పుల్లెల కిరణ్, రాజేందర్, మల్లేశ్, గిటుకు శ్రీనివాస్, ఓదెలు పాల్గొన్నారు.