అరెస్టులు.. ఆందోళనలు | Arrests and Concerns | Sakshi
Sakshi News home page

అరెస్టులు.. ఆందోళనలు

Published Sun, Jun 18 2017 12:52 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

అరెస్టులు.. ఆందోళనలు - Sakshi

అరెస్టులు.. ఆందోళనలు

సింగరేణిలో మూడవరోజూ కొనసాగిన సమ్మె
- సమ్మె ప్రభావం లేదన్న యాజమాన్యం
- ఆదివారం ప్లేడే ప్రకటించిన సింగరేణి
51 శాతం మంది కార్మికుల గైర్హాజరు
 
రుద్రంపూర్‌ (భద్రాద్రి కొత్తగూడెం) /మంచిర్యాల: సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాలు చేపడుతున్న సమ్మె ఉద్రిక్తతలకు దారితీసింది. శుక్రవారం కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో కార్మిక సంఘాలు శనివారం సింగరేణి బంద్‌కు పిలుపు నిచ్చాయి. శనివారం సింగరేణి వ్యాప్తంగా కార్మిక ప్రాంతాల్లో బంద్‌ కొనసాగింది. జాతీయ సంఘాలైన ఐఎన్‌టీ యూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్‌ ఇచ్చిన బంద్‌కు మద్దతుగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, బీజేపీ ఆందోళనకు దిగాయి. రాస్తారోకోలు, ధర్నాలు, ఆందోళనలు చేసిన కార్మిక సంఘాల నాయకులను, మద్దతు ప్రకటించిన పార్టీల నాయకుల ను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేష న్లకు తరలించారు. దీంతో ఆందోళ నలు, ఉద్రిక్తతల మధ్యనే మూడోరోజు సమ్మె కొనసాగింది. సింగరేణి వ్యాప్తంగా 51 శాతం మంది సమ్మెలో పాల్గొనగా 49 శాతం మంది విధులకు హాజరయ్యారు. 
 
ప్లేడే ప్రకటించిన యాజమాన్యం..
ఆదివారం కార్మికులు విధులు నిర్వ హించుకునేందుకు వీలుగా ప్లేడేను ప్రకటించింది. కార్మికులు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం కోరింది. ప్లేడే నిబంధ నల ప్రకారం ఆదివారం విధులు నిర్వ హించిన కార్మికులకు మస్టరు ఇవ్వడం తోపాటు ఒకరోజు సెలవు ఇవ్వనున్నట్లు తెలిపింది.
 
సింగరేణిలో సమ్మె ప్రభావం నిల్‌..
సాధారణ హాజరుతో పోలిస్తే శనివారం 72 శాతం మంది కార్మికులు విధులకు హాజరైనట్లు యాజమాన్యం తెలిపింది. ఇక ఉత్పత్తిలోనూ 16 శాతం వృద్ధి సాధించి, 21 శాతం ఎక్కువగా బొగ్గు రవాణా చేసినట్లు పేర్కొంది. సమ్మె తొలిరోజైన 15వ తేదీన 1,72,262 టన్నులు, 16వ తేదీన 1,76,195 టన్నులు ఉత్పత్తి జరగ్గా, మూడోరోజైన 17వ తేదీ మొదటి షిఫ్టులో 58,355 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగినట్లు వివరించింది. మూడురోజుల కాలంలో హాజరు శాతం సైతం పెరుగుతూ వస్తోందని, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు రోజువారీ కోటాకన్నా, సమ్మె రోజుల్లో ఎక్కువగానే బొగ్గు రవాణా చేయగలిగిందని పేర్కొంది.  
 
అరెస్ట్‌లు సరికాదు: బి.జనక్‌ప్రసాద్‌
గోదావరిఖని: సింగరేణి కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా కోల్‌బెల్ట్‌ బంద్‌లో పాల్గొన్న దాదాపు వెయ్యి మంది నాయకులు, కార్యకర్తల ను పోలీసులు అరెస్ట్‌ చేయడం సరికాదని జాతీయ కార్మిక సంఘాల జేఏసీ కన్వీన ర్‌ బి.జనక్‌ప్రసాద్‌ తెలిపారు. సింగరేణి యాజమాన్యం మైనింగ్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నదని, కార్మికులు మద్యం సేవించి గనుల వద్దకు వస్తే వారిని అనుమతించని యాజమాన్యం, నేడు సమ్మె నేపథ్యంలో గనులు, ఓసీపీల వద్దనే మద్యం, విందు భోజనాలు ఏర్పాటు చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌ కలసి ఎన్ని కుట్రలు పన్నినా సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొని వారసత్వ ఉద్యోగాల సాధన కోసం తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement