- భూతల్లిని కాపాడుకోవాలి
- రసాయన ఎరువులు తగ్గించాలి
- ప్రకతి వ్యవసాయదారుల సమావేశం తీర్మానం
ప్రకతి వ్యవసాయమే మేలు..
Published Tue, Aug 16 2016 12:08 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM
జగిత్యాల అగ్రికల్చర్ : భూతల్లి ఆరోగ్యాన్ని కాపాడడమే రైతుల లక్ష్యం కావాలని ప్రకతి వ్యవసాయదారుల సమావేశం తీర్మానించింది. మల్యాల మండలం ఓబులాపూర్ గ్రామంలోని రిటైర్డ్ ఎంఈవో అశోక్‌కుమార్ తోటలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రకతి వ్యవసాయదారుల శిక్షణ సమావేశం సోమవారం జరిగింది. రసాయన ఎరువులు వాడడంతో భూములు ఎలా పనికి రాకుండా పోతున్నాయని, ప్రకతి సిద్ధమైన వ్యవసాయాన్ని చేయడంతో కలిగే ఉపయోగాలపై ప్రయోగాత్మకమైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రకతి వ్యవసాయం చేస్తున్న రిటైర్డ్ ఎంఈవో అశోక్‌కుమార్ మాట్లాడుతూ ప్రకతిలో లభించే ఆకులు వంటి వ్యర్థాలతో ఖర్చులేకుండా వ్యవసాయం చేయవచ్చని చెప్పారు. విపరీతంగా రసాయన ఎరువులు వేయడంతో కర్బన శాతం తగ్గుతుందని తెలిపారు. దీన్ని పెంచేందుకు లెగ్యూమ్ జాతికి చెందిన జనుము, జీలుగ, పెసర్లు, కందులు, మినుములు, ఉలువలు, పిల్లి పెసర, అనుములు, అలసంద, అడవి అనుప మొక్కలను పెంచి 40 రోజుల తర్వాత వేళ్లు భూమిలోనే ఉంచి పంటను కోసి పొలంలో వేయాలని కోరారు. భూమిలో సూక్ష్మజీవులను పెంచేందుకు వర్మీకంపోస్టు, ఘనా జీవామతం, సప్తధాతువుల మిశ్రమాన్ని సమద్ధిగా అందించాలని కోరారు. ఒక లీటర్ దేశీ ఆవు మూత్రం, కొంచెం ఆవుపేడ, మురిగిన పండ్ల గుజ్జు లేదా బెల్లంతో ద్రావకం తయారుచేసిన ద్రావణంలో విత్తనాలను శుద్ధిచేసిన తర్వాతనే భూమిలో నాటాలని కోరారు. దీంతో మొక్క రోగనిరోధక శక్తితో ఆరోగ్యవంతంగా ఉండి తెగుళ్లు ఆశించకపోవడంతో పంటల దిగుబడి ఖర్చు తగ్గుతుందని వివరించారు. వర్మీకంపోస్టును పంటలకు నేరుగా వాడకుండా నీడకు పోసి అందులో తెగుళ్లను అదుపు చేసే ట్రైకోడెర్మా ఫంగస్‌ను కలుపడంతో జీవామతం, ఆకుల కషాయం కలిపి వాడుకుంటే మంచి ఫలితం ఉంటుందని అన్నారు. ఆకులే కాకుండా చేపలు, కోళ్ల వ్యర్థాలు, కోడిగుడ్ల పెంకులు, జంతువుల ఎముకలతోనూ ఘన జీవామతం తయారు చేసుకుని పంటలకు పిచికారీ చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ప్రకతి వ్యవసాయం నిర్వాహకుడు భాస్కర్ పదిరే తదితరులు పాల్గొన్నాడు.
నెలకు రూ.2లక్షల ఉద్యోగం వదులుకుని..
–అపర్ణ, మహబూబ్‌నగర్
అమెరికాలో నెలకు రూ.2 లక్షల సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదులుకుని పాలేకర్, సహజ సిద్ధమైన వ్యవసాయం చేస్తున్నా. గ్రామంలో రైతులందరు విపరీతంగా రసాయన మందులు వేస్తున్నా దిగుబడి గిట్టుబాటు అయ్యేది కాదు. అందుకే చాలాసార్లు చెప్పి చూశా. అమెరికాలో ఉన్న అమ్మాయి ఏమైనా చెబుతుంది అనుకునేవారు. దీంతో రైతులను మార్చేందుకు నేనే స్వయంగా ప్రకతి వ్యవసాయాన్ని చేయడం మొదలుపెట్టా. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు జగిత్యాలకు వచ్చా.
స్టాఫ్‌వేర్ సంస్థను వద్దనుకుని..
–క్రాంతి, రామాయం పేట, మెదక్
నలుగురు మిత్రులం స్టాఫ్‌వేర్ సంస్థను నెలకొల్పితే మంచి లాభాలు వచ్చాయి. అయితే ఏసీ గదుల్లో జీవితం నచ్చలేదు. అందుకే నలుగురం కలిసి 40ఎకరాలను కొని రసాయన ఎరువులు వేయకుండా ప్రకతి సిద్ధమైన వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయంలోనే తప్తిగా ఉన్నామన్న భావన కలుగుతోంది.
ఎకరాకు 80 డ్రమ్ముల పసుపు దిగుబడి
– రాజశేఖర్, ఆదిలాబాద్ జిల్లా
పాలేకర్, ప్రకతి సిద్ధమైన వ్యవసాయం చేయడంతో గతేడాది పసుపులో ఎకరానికి 80 డ్రమ్ముల పసుపు దిగుబడి వచ్చింది. ఈ పద్ధతిలో ఖర్చును 100 శాతం నుంచి 10 శాతానికి తగ్గించుకోగలిగా. ఈ పద్ధతి చేసేందుకు రైతులకు ఓపిక ఉండాలి. అప్పుడే రెండు, మూడేళ్లలో విజయాలు కనబడతాయి.
Advertisement
Advertisement