కుప్పంరూరల్: మండలంలో కంగుంది పంచాయతీ పరిధిలోని పెద్దవంకలో చెక్‌డ్యామ్ ఎత్తు పెంచడంపై తమిళనాడు సీఎం జయలలిత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు శుక్రవారం లేఖ రాసింది. పాలారు పరివాహక ప్రదేశమైన పెద్దవం క గ్రామంలోని కనకనాశమ్మ దేవాలయం వద్ద చెక్‌డ్యామ్ ఎత్తు పెంచరాదని లేఖలో పేర్కొంది.
1892లో మద్రాసు- మైసూ రు ఒప్పందం ప్రకారం కర్ణాటకలో ప్రా రంభమై ఆంధ్ర మీదుగా తమిళనాడులో ప్రవహించి, సముద్రంలో కలిసే పాలారు నదిపై దిగువ ప్రాంతమైన తమిళనాడు అనుమతి లేకుండా పైభాగంలో చెక్‌డ్యామ్‌లు, ఆనకట్టలు కట్టరాదన్న విషయా న్ని లేఖలో తెలిపింది. ప్రస్తుతం కనకనాశమ్మ దేవాలయం వద్ద ఐదు అడుగుల ఎత్తు చెక్‌డ్యామ్ ఉందని, డ్యామ్ మరో ఐదు అడుగులు ఎత్తు పెంచేందుకు ఆం ధ్ర ప్రభుత్వం కట్టడాలు చేపడుతుందని, ఇది మద్రాసు - మైసూరు ఒప్పందం ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపింది.
జయ లేఖరాయడానికి అసలు కథ..
కంగుంది పంచాయతీ పరిధిలోని పెద్దవంక వద్ద నాలుగు దశాబ్దాల క్రితం కనకనాశమ్మ దేవాలయం వెలిసింది. ఈ దేవాలయం ఆంధ్ర ప్రాంతంలో ఉంది. మొదట్లో ఆంధ్రులే దేవాలయాన్ని ని ర్మాణం చేపట్టారు. తమిళనాడు సరిహద్దుల్లో ఉండడంతో కాలక్రమంలో తమిళులు ఆక్రమించుకుని దేవాలయాన్ని అ భివృద్ధి చేశారు. కానీ దశాబ్దకాలంగా త మిళులకు, పెద్దవంక గ్రామస్తులకు దేవాలయ విషయమై వాదనలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై పలుమార్లు రాష్ట్ర, జిల్లా సర్వేయర్లు ఇరురాష్ట్రాల అధికారుల సమక్షంలో దేవాలయం ఆంధ్రకు దక్కుతుందని తీర్మానించారు.
ఈ ఏడు దేవాలయం నిర్వహణ ఆంధ్ర అధికారులు, ప్రజలు చేపట్టి, గురువారం దేవాలయం ఆలయంలో వాహనాల స్టాండు కోసం వేలం పాట సైతం నిర్వహించారు. వీటన్నింటిని జీర్ణించుకోలేని సరిహద్దులోని తిమ్మంపేట తమిళనాడు వాసులు తమిళ నాయకుల ద్వారా సీఎంపై ఒత్తిడి తెచ్చి లేఖ రాయించారు. అంతే తప్పా 0.1 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కూడా లేని చెక్‌డ్యామ్ నిర్మాణంపై కాదని తెలుస్తోంది.
ఆ లేఖ వెనుక..
Published Sat, Jul 2 2016 2:52 AM | Last Updated on Tue, Aug 14 2018 2:24 PM
Advertisement
Advertisement