రోడ్డు ప్రమాదంలో నెల్లూరి వాసి మృతి
రోడ్డు ప్రమాదంలో నెల్లూరి వాసి మృతి
Published Thu, Feb 9 2017 10:57 PM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM
ఓర్వకల్లు:
కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై గురువారం రాత్రి 9గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా కావలి ముక్తాల్ గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుడు వెంకటసుబ్బయ్యనాయుడు (38) మరణించాడు. ఇతడు కొన్నేళ్లుగా కర్నూలు జిల్లాలో టార్పాలిన్ వ్యాపారం నిర్వహించే వారు. గురువారం సాయంత్రం వ్యాపార నిమిత్తం నంద్యాల నుంచి కర్నూలుకు బైక్‌పై బయలుదేరాడు. ఓర్వకల్లు సమీపంలోని పవర్‌గ్రిడ్ విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర రోడ్డు మలుపును దాటుతూ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హెడ్‌కానిస్టేబుల్ కేశవరెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు తెలిపారు.
Advertisement
Advertisement