పెళ్లయిన రెండు రోజులకే ఆరిన ఆశలు | newly wed man drowned in chittoor district | Sakshi
Sakshi News home page

పెళ్లయిన రెండు రోజులకే ఆరిన ఆశలు

Published Sun, Jun 19 2016 9:13 AM | Last Updated on Mon, Oct 8 2018 3:07 PM

పెళ్లయిన రెండు రోజులకే ఆరిన ఆశలు - Sakshi

పెళ్లయిన రెండు రోజులకే ఆరిన ఆశలు

శాంతిపురం: కాళ్ల పారాణి ఆరక ముందే ఓ నవ వధువు దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఈతకని వెళ్లిన భర్త తిరిగిరాని లోకాలకు చేరడంతో ఆమె ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లిలో శనివారం చోటు చోటుచేసుకుంది.

కడపల్లికి చెందిన సామప్ప, చెన్నమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆఖరి వాడైన శివ(22)కు తమిళనాడులోని కృష్ణగిరి సమీపంలోని బందార్లపల్లెకు చెందిన మునెమ్మతో ఈ నెల 16న కృష్ణగిరిలో వివాహం చేశారు. అత్తారింట ఉన్న శివ శనివారం ఉదయం పది గంటల సమయంలో గ్రామ సమీపంలోని బావి వద్దకు ఈతకు వెళ్లాడు. ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో బంధువులు గాలించారు. బావి వద్ద శివ బట్టలు, చెప్పులు కనిపించడంతో అనుమానంతో బావిలో వెతకగా శివ మృతదేహం లభించింది.

ఈ విషయం తెలిసిన వెంటనే మృతుడి కుటుంబ సభ్యులు, గ్రావుస్తులు హుటాహుటిన కృష్ణగిరికి తరలి వెళ్లారు. పెళ్లయిన రెండు రోజులకే భర్త మరణించడంతో ఆ నవ వధువు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కృష్ణగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement