- ఓడలరేవు బీవీసీ ఇంజనీరింగ్
- విద్యార్థుల వినూత్న ఆలోచన
- క్యాన్సర్ బాధితులకు ఇతోథిక సేవ
సేవే లక్ష్యంగా ‘నో షేవ్’
Published Tue, Nov 29 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM
అమలాపురం టౌ¯ŒS / అల్లవరం :
నేటి కళాశాలల యువత ఆలోచన్లు అన్నీ చదువు తర్వాత ఫ్యాషన్లపైనే ఎక్కువగా ఉంటాయి. సేవ కోసం వారు ఫ్యాషన్‌ను సైతం పక్కనపెడుతున్నారు. నవంబర్ నెల అంతా గెడ్డం గీసుకోకుండా అందుకు అయ్యే ఖర్చులను ఏదో సేవకు ఉపయోగించడానికి సంకల్పించా రు. ‘నో షేవ్ నంవంబర్’ పేరుతో కళాశాలలో మూడు, నాలుగో సంవత్సరాలకు చెందిన దాదాపు 60 మంది విద్యార్థులు ఈ నెలంతా షేవ్ చేసుకోకుండా ఉండిపోయారు. దీనికి ‘లెట్స్ యాడ్ ఛారిటీ టూ అవర్ స్టయిల్స్’ అని ట్యాగ్ మాదిరిగా ఓ స్లోగ¯ŒSలో లోగోకు రూపకల్పన చేశారు. ఇప్పటికే ఓడలరేవు బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కొన్నేళ్ల కిందటే ‘సాల్ట్ ఆఫ్ సర్వీస్’ అనే పేరుతో ఓ సేవా సంస్థను ఏర్పాటు చేసుకుని విరాళాలు సేకరిస్తూ ఆ డబ్బులను అగ్ని ప్రమాద బాధితులకు.. పేద కుటుంబాల్లోని క్యాన్సర్ రోగగ్రస్తులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పుడు ఈ 60 మంది విద్యార్థులు ‘నో షేవ్ నంవబర్’ పేరుతో ఎవరికి వారు కొంత నగదును విరాళాలుగా సేకరించి ఆ డబ్బును తమ కళాశాలలో అప్పటికే నడుస్తున్న సేవా సంస్థ సాల్ట్ ఆఫ్ సర్వీస్‌కు ఇవ్వాలనుకుంటున్నారు. ఈ నిర్ణయం వారిలో సేవా భావాన్నే కాదు..స్నేహ బంధాన్ని కూడా బలపరుస్తోంది. కొన్ని పాశ్చాత్య దేశాల్లో కొన్ని సంస్థల ఉద్యోగులు లేదా కొన్ని విద్యా సంస్థల విద్యార్థులు ఇలా ఏదో నెలలోనో.. కొన్ని రోజులో గెడ్డాలు గీసుకోకుండా ఆ సమయంలో కొంత డబ్బును పొదుపుచేసి సేవా కార్యక్రమాలకు వినియోగింటచం జరుగుతోంది. ఆ కాన్సెప్‌్టను ఆదర్శంగా తీసుకుని ఈ కళాశాల విద్యార్థులు ఇలా సేవకు శ్రీకారం చుట్టారు.
సేవకు ఇదో మార్గమనుకున్నాం
సేవ చేయడానికి ఏదో ఒక భావన ప్రోత్సహిస్తుంది. కొత్త మార్గంలో ఈ ఆలోచనకు మా తోటి విద్యార్థులంతా సై అనుకున్నాం. షేవ్ చేసుకోకుండా తాము విరాళాలు సేకరించి ఏదో సేవకు వెచ్చించాలనుకున్నాం.
– కౌశల్ అడ్డూరి, బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థ్ధి, ఓడలరేవు.
ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతాం
అమెరిక¯ŒS క్యాన్సర్ సొసైటీ నో షేవ్ పేరుతో ప్రారంభించిన ఈ సేవా మార్గాన్ని మేమూ ఎంచుకున్నాం. అక్కడ ఈ సేవతో వచ్చిన విరాళాలను క్యాన్సర్ రోగుల వైద్యం కోసం వెచ్చిస్తారు. అలాగే మేము సాల్ట్ ఆఫ్ సర్వీస్ సంస్థ ద్వారా ఏదో సేవకు ఉపయోగపడేలా చేయాలనుకుంటున్నాం.
– చరణ్ తోలేటి, బీవీసీ ఇంజనీరింగ్ విద్యార్థి, ఓడలరేవు
Advertisement
Advertisement