నామినేషన్ల పరిశీలన పూర్తి | nomination probation completed | Sakshi
Sakshi News home page

నామినేషన్ల పరిశీలన పూర్తి

Published Thu, Mar 2 2017 12:04 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM

nomination probation completed

కర్నూలు(అగ్రికల్చర్‌): శాసనమండలి లోకల్‌ అథారిటీ నియోజకవర్గం ఎన్నికలకు ధాఖలైన నామినేషన్‌లను బుధవారం రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ పరిశీలించారు. మొత్తం ఆరు నామినేషన్‌లు రాగా ఒక దానిని తిరస్కరించారు. మిగిలిన ఐదు నామినేషన్‌ పత్రాలు సక్రమంగా ఉన్నట్లుగా జేసీ ప్రకటించారు. వైఎస్‌ఆర్‌పీ అభ్యర్థిగా గౌరువెంకటరెడ్డి మూడు సెట్ల నామినేషన్‌లు వేయగా ఒకటి తిరస్కరణకు గురైంది. అఫిడ్‌విట్‌ను సరిగా నింపకపోవడం, ఖాళీలను పూర్తి చేయకపోవడం, నోటీసులు ఇచ్చినా స్పందించలేదనే కారణంతో ఒక నామినేషన్‌ను తిరస్కరించారు. మిగిలిన రెండు సక్రమంగా ఉన్నట్లు ప్రకటించారు. అభ్యర్థుళ/ లేదా వారి న్యాయవాదులు సమక్షంలో జేసీ నామినేషన్‌లను పరిశీలించారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి గౌరు  వెంకటరెడ్డి రెండు నామినేషన్‌లు, టీడీపీ అభ్యర్ధి శిల్పామోహన్‌రెడ్డి రెండు నామినేషన్‌లు, ఇండిపెండెంట్‌ అభ్యర్థి వైజా వెంకటేశ్వరరెడ్డి ఒక నామినేషన్‌ సక్రమంగా ఉన్నాయని తెలిపారు. నామినేషన్‌ల ఉపసంహరణకు 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉందని తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement