నామినేషన్లు నిల్..!
Published Sun, Feb 26 2017 12:30 AM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM
- మరో రెండు రోజులే అవకాశం
- స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు
కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి లోకల్ అథారిటీ నియోజక వర్గం ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌లు ఇప్పటి వరకు దాఖలు కాలేదు. కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికలకు రిటర్నింగ్ అధికారి, జేసీ హరికిరణ్.. ఈ నెల 21న నోటిపికేషన్ జారీ చేశారు. అదే రోజు నుంచి నామినేషన్‌లకు అవకాశం ఉంది. అయితే ఇంతవరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఈ నెల 28 వరకు నామినేషన్‌లకు అవకాశం ఉంది. అయితే 26న ఆదివారం కావడంతో నామినేషన్‌లు స్వీకరించరు. ఇక సోమ, మంగళవారాల్లో మాత్రమే నామినేషన్‌లకు అవకాశం ఉంది. సోమవారం నామినేషన్లు ధాఖలు అయ్యే అవకాశం ఉంది.
Advertisement
Advertisement