local authority
-
నామినేషన్ల పరిశీలన పూర్తి
కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి లోకల్ అథారిటీ నియోజకవర్గం ఎన్నికలకు ధాఖలైన నామినేషన్లను బుధవారం రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ హరికిరణ్ పరిశీలించారు. మొత్తం ఆరు నామినేషన్లు రాగా ఒక దానిని తిరస్కరించారు. మిగిలిన ఐదు నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నట్లుగా జేసీ ప్రకటించారు. వైఎస్ఆర్పీ అభ్యర్థిగా గౌరువెంకటరెడ్డి మూడు సెట్ల నామినేషన్లు వేయగా ఒకటి తిరస్కరణకు గురైంది. అఫిడ్‌విట్‌ను సరిగా నింపకపోవడం, ఖాళీలను పూర్తి చేయకపోవడం, నోటీసులు ఇచ్చినా స్పందించలేదనే కారణంతో ఒక నామినేషన్‌ను తిరస్కరించారు. మిగిలిన రెండు సక్రమంగా ఉన్నట్లు ప్రకటించారు. అభ్యర్థుళ/ లేదా వారి న్యాయవాదులు సమక్షంలో జేసీ నామినేషన్లను పరిశీలించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి రెండు నామినేషన్లు, టీడీపీ అభ్యర్ధి శిల్పామోహన్‌రెడ్డి రెండు నామినేషన్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి వైజా వెంకటేశ్వరరెడ్డి ఒక నామినేషన్ సక్రమంగా ఉన్నాయని తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉందని తెలిపారు. -
నామినేషన్లు నిల్..!
- మరో రెండు రోజులే అవకాశం - స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి లోకల్ అథారిటీ నియోజక వర్గం ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు ఇప్పటి వరకు దాఖలు కాలేదు. కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికలకు రిటర్నింగ్ అధికారి, జేసీ హరికిరణ్.. ఈ నెల 21న నోటిపికేషన్ జారీ చేశారు. అదే రోజు నుంచి నామినేషన్లకు అవకాశం ఉంది. అయితే ఇంతవరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఈ నెల 28 వరకు నామినేషన్లకు అవకాశం ఉంది. అయితే 26న ఆదివారం కావడంతో నామినేషన్లు స్వీకరించరు. ఇక సోమ, మంగళవారాల్లో మాత్రమే నామినేషన్లకు అవకాశం ఉంది. సోమవారం నామినేషన్లు ధాఖలు అయ్యే అవకాశం ఉంది. -
రెండో రోజు నామినేషన్లు నిల్
కర్నూలు(అగ్రికల్చర్): శాసన మండలి లోకల్ అ«థారిటీ నియోజకవర్గం ఎన్నికలకు రెండవ రోజు కూడా నామినేషన్లు దాఖలు కాలేదు. మంచి రోజు నామినేషన్లు దాఖలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. వివిధ పార్టీల వారు రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి నామినేషన్ల పత్రాలను తీసుకెళ్లారు. గురువారం నుంచి నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.