
శ్రీవారి దర్శనానికి 3 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వెంకన్న సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుండగా కాలి నడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
ఆదివారం 78,752మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 30,424మంది తలనీలాలు సమర్పించారు. ఆదాయం రూ.2.67 కోట్లు వచ్చింది. శ్రీవారిని దర్శించుకున్నవారిలో ఎక్కువమంది అయ్యప్పస్వామి భక్తులే ఉన్నారు.