గురూజీ కాదు.. కామ పిశాచి | not guruji.. sexual hobgoblin | Sakshi
Sakshi News home page

గురూజీ కాదు.. కామ పిశాచి

Published Sat, Dec 10 2016 11:55 PM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM

not guruji.. sexual hobgoblin

- బెంగళూరులో కర్నూలు యువతిపై అత్యాచారయత్నం 
- పోలీసులకు ఫిర్యాదు 
 
సాక్షి, బెంగళూరు: కర్నూలుకు చెందిన యువతిపై బెంగళూరులోని ఓ న్యూమరాలజిస్ట్‌ అత్యాచార యత్నానికి ప్రయత్నించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. నగరంలోని ఆర్‌ఆర్‌నగర్‌లో నివాసముంటున్న ఆర్య వర్ధన్‌ ‘గురూజీ’ న్యూమరాలజీ (సంఖ్యాశాస్త్రం) క్లాసులను నిర్వహిస్తుంటాడు. ఆసక్తి ఉన్న వారికి సంఖ్యాశాస్త్రంలో శిక్షణనిస్తానని ప్రకటించగా, బాధితురాలు ఆగస్ట్‌లో బెంగళూరుకు వచ్చి ఆర్యవర్ధన్‌ వద్ద శిక్షణ తీసుకుంటోంది.

మొదట్లో కొన్ని రోజులు బాగానే ఉన్నా శిక్షణ చివరి దశకు వచ్చిన సమయంలో గురూజీ ఆ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె తప్పని వారించినా వినలేదు. ఆగస్టు 21న అత్యాచార యత్నం చేయగా, ఎలాగో తప్పించుకొన్న యువతి స్వస్థలానికి చేరుకుంది. మొదట్లో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి భయపడ్డ ఆ యువతి స్నేహితులు, బంధువుల సూచనల మేరకు శనివారం బెంగళూరుకు చేరుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా శిక్షణ కోసం తన వద్ద రూ.1.50 లక్షలను తీసుకున్నాడని, ఆ సొమ్మును కూడా ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement