numerologist
-
సమంతకు ఏమైంది ..ఆమె వ్యాధి అంత తీవ్రమైందా..?
-
స్పెల్లింగ్ మార్చితే కరోనా మాయమట..!
సాక్షి, అనంతపురం: దేశంలో కరోనా వైరస్ అల్లకల్లోలాన్ని సృష్టిస్తోంది. రోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరతతో ఇప్పటికే చాలా మంది మరణించారు. దేశంలోని వైద్యులు 24 గంటల పాటు కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తుండగా, మరోవైపు కొంత మంది మూఢనమ్మకాలపై విశ్వసిస్తున్నారు. కరోనా వైరస్‌ను తమ గ్రామం నుంచి తరిమివేయడం కోసం స్థానిక మహిళలు ప్రజలు దేవుడికి భారీ సంఖ్యలో ఊరేగింపు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అనంతపురంకు చెందిన ఓ వ్యక్తి కరోనా పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. న్యూమారాలజీ ప్రకారం కరోనా, కోవిడ్-19 లోని స్పెల్లింగ్‌లో కాస్త మార్పులు చేస్తే కరోనా ఇట్టే మాయమవుతుందని కొత్త పల్లవి అందుకున్నాడు. ఇంగ్లీషులో కరోనాను ‘CARONAA’ గా కోవిడ్‌ను ‘COVVIYD-19’ మార్చితే మార్పును చూడవచ్చునని తెలిపాడు. అతడు స్థానికంగా న్యూమారాలజిస్ట్‌గా పనిచేస్తుంటాడు. కాగా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఓ నెటిజన్ ఒకసారి స్పెల్లింగ్ మార్పు చేస్తే కరోనా తగ్గిపోతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. మరొక నెటిజన్ ఎవరి నమ్మకాలు వారివి.. వారు అలా చెప్పారని మనం ఎవరిని కించపరచలేం. మనమైతే కరోనాను జయించడానికి మాస్క్‌ను, భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని తెలిపాడు. చదవండి: ఫైర్ లేడీ.. నిప్పు రవ్వలను మిఠాయిల్లా మింగేస్తోంది -
ట్రంప్ గెలుస్తాడంటున్న జ్యోతిష్కులు
వాషింగ్టన్: ఈ దఫా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు గెలుస్తారని జ్యోతిష్కులు, న్యూమరాలజిస్టులు అంచనాలు వేస్తున్నారు. లైఫ్ పాత్ నంబర్, మాస్టర్ ఇయర్ ఆధారంగా ట్రంప్ విజయం ఖాయమని జ్యోతిష్కులు భావిస్తున్నట్లు యాహూ న్యూస్ తెలిపింది. న్యూమరాలజిస్టులు లైఫ్ పాత్ నంబర్, మాస్టర్ ఇయర్ ఆధారంగా జాతకాలు చెబుతారు. లైఫ్‌పాత్ నంబర్ అంచనా ఒక వ్యక్తి జన్మతేదీలో అంకెలను ఒక ప్రత్యేక పద్ధతిలో కూడడం ద్వారా లైఫ్‌పాత్ నంబర్‌ను నిర్ణయిస్తారు. దీన్ని డెస్టినీ నంబర్ అనికూడా అంటారు. ట్రంప్ బర్త్‌డేట్: 14–06–1946. ఇందులో అంకెలను ప్రత్యేక పద్ధతిలో కూడితే 22 వస్తుంది. ఇది ట్రంప్ లైఫ్‌పాత్ నంబర్. ఈ నెంబర్ వచ్చిన వ్యక్తులు మాస్టర్ బిల్డర్స్ అని న్యూమరాలజిస్టులు చెబుతున్నారు. వీరివన్నీ భారీ ప్రణాళికలు, భారీ విజయాలని, వీరికి ఆత్మ విశ్వాసం ఎక్కువని తెలిపారు. వ్యాపారం, రాజకీయాల్లో ఈ నంబరున్న వ్యక్తులు బాగా రాణిస్తారన్నారు. ఇక జోబైడెన్ బర్త్‌డేట్: 20–11–1942. ఇందులో అంకెలను ప్రత్యేక పద్దతిలో కూడితే 2 వస్తుంది. ఇది అత్యంత తక్కువ శక్తి ఉన్న నంబరని, ఈ నంబరు వ్యక్తులు ఎంత పనిచేసినా గుర్తింపు పొందలేరని నిపుణులు విశ్లేషించారు. ఇక ఎన్నికలు జరిగే 2020 సంవత్సరాన్ని చూస్తే ఇది ట్రంప్‌కు మాస్టర్ ఇయర్ అని వివరించారు. -
గురూజీ కాదు.. కామ పిశాచి
- బెంగళూరులో కర్నూలు యువతిపై అత్యాచారయత్నం - పోలీసులకు ఫిర్యాదు సాక్షి, బెంగళూరు: కర్నూలుకు చెందిన యువతిపై బెంగళూరులోని ఓ న్యూమరాలజిస్ట్ అత్యాచార యత్నానికి ప్రయత్నించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. నగరంలోని ఆర్‌ఆర్‌నగర్‌లో నివాసముంటున్న ఆర్య వర్ధన్ ‘గురూజీ’ న్యూమరాలజీ (సంఖ్యాశాస్త్రం) క్లాసులను నిర్వహిస్తుంటాడు. ఆసక్తి ఉన్న వారికి సంఖ్యాశాస్త్రంలో శిక్షణనిస్తానని ప్రకటించగా, బాధితురాలు ఆగస్ట్‌లో బెంగళూరుకు వచ్చి ఆర్యవర్ధన్ వద్ద శిక్షణ తీసుకుంటోంది. మొదట్లో కొన్ని రోజులు బాగానే ఉన్నా శిక్షణ చివరి దశకు వచ్చిన సమయంలో గురూజీ ఆ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె తప్పని వారించినా వినలేదు. ఆగస్టు 21న అత్యాచార యత్నం చేయగా, ఎలాగో తప్పించుకొన్న యువతి స్వస్థలానికి చేరుకుంది. మొదట్లో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి భయపడ్డ ఆ యువతి స్నేహితులు, బంధువుల సూచనల మేరకు శనివారం బెంగళూరుకు చేరుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా శిక్షణ కోసం తన వద్ద రూ.1.50 లక్షలను తీసుకున్నాడని, ఆ సొమ్మును కూడా ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.