మొరాయించిన గాజులదిన్నె క్రస్ట్ గేట్
మొరాయించిన గాజులదిన్నె క్రస్ట్ గేట్
Published Thu, Aug 4 2016 12:16 AM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM
గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్ట్ గేట్..బుధవారం మొరాయించింది. సామర్థ్యానికి మించి వరద నీరు రావడంతో ఉదయం జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాజెక్ట్ అధికారులు క్రస్ట్‌గేట్ల ట్రై ల్‌రన్ నిర్వహించారు. ప్రాజెక్ట్‌కు ఉన్న ఆరు క్రస్ట్‌గేట్లలో 5,4,3,1 వగేట్లు 10 సెంటీమీటర్ల మేర ఎత్తి పరిశీలించారు. అయితే అందులో మూడో గేట్‌ను కిందికి దింపి మూసేందుకు ప్రయత్నించగా అది మోరాయించింది.í Üబ్బంది, అధికారులు నాలుగుగంటల పాటు శ్రమించి చివరకు మూసివేశారు. అయినప్పటికీ ఆక్రస్ట్‌గేట్ పూర్తిగా మూసుకొని పోకపోవడంతో ఇసుకను బస్తాల్లో నింపి నీటి లీకేజిని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్ట్‌లో నీటి సామర్థ్యం పెరగడంతో 2009లో క్రస్ట్‌గేట్లు ఎత్తారు. అప్పటì æనుంచి ప్రాజెక్ట్ నిండిన దాఖలాలు లేవు. ప్రస్తుతం భారీ స్థాయిలో వరద నీరు రావడంతో ముందుజాగ్రత చర్యల్లో భాగంగా క్రస్ట్‌గేట్లు ట్రైల్ రన్ నిర్వహించినట్లు ఈఈ బాస్కర్‌రెడ్డి, డీఈ లక్ష్మణ్‌కుమార్ తెలిపారు.
Advertisement