గుంటూరు: ఉద్యోగుల భవిష్యనిధి చెల్లింపులు ఇక నుంచి ప్రతినెలా 15వ తేదీలోపు కట్టాలని రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పి.వీరభద్రస్వామి తెలిపారు. ఈపీఎఫ్ చట్టం కింద వివిధ వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు చెందిన యజమానులు ప్రతినెలా 15వ తేదీలోపు చెల్లింపులు చేయాల్సివుంటే, పెనాల్టీలు లేకుండా మరో ఐదు రోజుల గడువుతో చెల్లింపులకు అవకాశం ఇచ్చామన్నారు.
ఫిబ్రవరి నుంచి ప్రతి నెలా 15 లోపు చెల్లింపులు జరపాలని, లేకుంటే ఆ మొత్తాలపై వడ్డీతోపాటు డామేజీలు కూడా ఉంటాయని తెలిపారు. ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన వ్యాపార, పారిశ్రామిక సంస్థల యజమానులు చెల్లింపులు చేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు.
ప్రతినెలా 15 లోపు భవిష్యనిధి చెల్లింపులు
Published Sat, Jan 30 2016 7:29 PM | Last Updated on Wed, Sep 5 2018 8:20 PM
Advertisement
Advertisement