వైద్య బిల్లులకు చిల్లు..! | NTR health services, the estimated cost of Rs.850 crore | Sakshi
Sakshi News home page

వైద్య బిల్లులకు చిల్లు..!

Published Wed, Oct 28 2015 2:03 AM | Last Updated on Mon, Aug 20 2018 4:17 PM

వైద్య బిల్లులకు చిల్లు..! - Sakshi

వైద్య బిల్లులకు చిల్లు..!

♦ ఎన్టీఆర్ ఆరోగ్య సేవల అంచనా వ్యయం రూ.850 కోట్లు
♦ బడ్జెట్‌లో కేటాయించింది రూ.500 కోట్లే..
♦ ఇప్పటి దాకా ఇచ్చిన నిధులు రూ.125 కోట్లు
 
 ఎన్టీఆర్ ఆరోగ్యసేవగా పేరు మార్చుకున్న ‘ఆరోగ్యశ్రీ’ పథకం అనారోగ్యం పాలైంది. సామాన్యుడికి వైద్యసేవలు అందించలేక కునారిల్లుతోంది. పెద్ద జబ్బుల బాధితులకు ఆపన్నహస్తం అందిస్తూ వస్త్తున్న పథకం నీరసపడిపోయింది. పథకానికి ప్రభుత్వం సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో బాధితులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. ప్రభుత్వం సరిపడా నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు కొండల్లా పేరుకుపోతున్నాయి.

బకాయిలు చెల్లించక ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ, మౌలిక వసతులు లేక ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ చికిత్సలు తిరస్కరించడంతో రోగులు విలవిల్లాడుతున్నారు. పథకానికి ఏడాదికి కనీసం రూ.850 కోట్లు వ్యయం అవుతుందని బడ్జెట్ కేటాయింపుల్లో అధికారులు నివేదిక ఇస్తే... ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించి చేతులు దులుపుకొంది. ఆర్నెళ్ల కాలానికి గాను నిధులు ఇవ్వాల్సి ఉండగా... మూడు నెలలకు చెందిన రూ.125 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంతో ప్రైవేటు ఆస్పత్రులకు రూ.60 కోట్ల వరకూ బకాయిలు పేరుకుపోయాయి. దీంతో చికిత్సలు కొనసాగించలేమని ప్రైవేటు ఆస్పత్రులు కరాఖండిగా తేల్చి చెబుతున్నాయి. విధిలేక రోగులు కళ్లు తేలేస్తున్నారు.
 
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ ఆరోగ్యసేవ (ఆరోగ్య శ్రీ) నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది.  ఆరో గ్యశ్రీ కింద వైద్యం పొందాల్సిన వందలాది మంది బాధితులకు ఈ పరిణామం తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. గత కొన్ని నెలలుగా ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సిన మేరకు నిధులు మంజూరు చేయడం లేదు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చికిత్స లూ మందగించినట్టు అధికార వర్గాలు పేర్కొంటు న్నాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో గుండె, న్యూ రో జబ్బులకు సంబం ధించిన చికిత్సలను ప్రైవేటు ఆస్పత్రులు తిరస్కరి స్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. విభజన తర్వాత హైదరాబాద్‌లోని ఆస్పత్రులు ఏపీ నుంచి వచ్చే రోగులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

 మూడు మాసాలకు ఇచ్చింది రూ.125 కోట్లే
 ఆరోగ్యశ్రీ పథకానికి ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయిం చింది కేవలం రూ.500 కోట్లు మాత్రమే. కానీ ఇప్పటి వరకూ పథకం కోసం ఆర్థిక శాఖ ఇచ్చింది తొలి త్రైమాసికానికి కేవలం రూ.125 కోట్లు మాత్ర మే అని ట్రస్ట్ అధికారి ఒకరు చెప్పారు. అంటే ఏప్రిల్, మే, జూన్ మాసాలకు మాత్రమే ఈ సొమ్ము ఇచ్చారు. జూలై నుంచి ఇప్పటివరకూ రెండో త్రైమా సికానికి సంబంధించిన నిధులు ఇవ్వలేదని అధికా ర వర్గాలు తెలిపాయి. వాస్తవానికి రూ.2.50 లక్షల కు ప్రీమియం పెంపు, 938 జబ్బులను 1,038కి పెంచడం కారణంగా ఏడాదికి కనీసం రూ.850 కోట్లు వ్యయం అవుతుందని బడ్జెట్ కేటాయింపుల సమయంలోనే అధికారులు నివేదిక ఇచ్చారు.

కానీ ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చింది. అదికూడా 7 నెలలు గడి చినా మూణ్నెళ్లకు మాత్రమే నిధులివ్వడం పథకం డోలాయమానంలో పడింది. మరోవైపు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చే నిధులు కూడా త్రైమాసికానికే ఇచ్చారని అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు రూ.60 కోట్ల వరకూ బకాయిలు ఉన్న ట్టు తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రతినిధి చెప్పారు.

 సూపర్ స్పెషాలిటీ కష్టాలు...
 ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క విశాఖపట్నం మినహా సూపర్ స్పెషాలిటీ సేవలు ఎక్కడా లేవు. దీంతో రోగులు ప్రధానంగా హైదరాబాద్‌కు రావాల్సిందే. తెలంగా ణ రాష్ట్ర పరిధిలోని ఈ ఆస్పత్రులు ప్యాకేజీలు పెం చాలని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో అటు ప్రభుత్వ పరిధిలోగానీ, ఇటు ప్రైవేటులోగానీ క్యాన్సర్ ఆస్పత్రులు లేవు. వీళ్లందరూ హైదరా బాద్‌కు రావాల్సిందే. ఈ పరిస్థితుల్లో ఇక్కడి ఆస్పత్రులు ప్రస్తుత ప్యాకేజీ ధరలపై చికిత్సలు అందించేందుకు సుముఖంగా లేకపోవడం, మరోవైపు బకాయిలు పేరుకుపోతూండటంతో ఖరీదైన చికిత్సల విషయంలో జాప్యం చేస్తున్నట్టు స్వయానా ఆస్పత్రుల ప్రతినిధులే చెబుతున్నారు.

 ప్రభుత్వాసుపత్రుల్లో భారీగా తగ్గిన సర్జరీలు
 వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఏపీలోని బోధనాసుపత్రులు ఆరోగ్యశ్రీ నిధుల జాప్యంతో మరింత కునారిల్లుతున్నాయి. గడిచిన 8 నెలల్లో శస్త్రచికిత్సల సంఖ్య భారీగా తగ్గినట్టు ఆస్పత్రుల ప్రిన్సిపల్స్ చెప్పారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి నిధు లు రాకపోవడం, సూపర్ స్పెషాలిటీ వైద్యులు లేకపోవడం కారణంగా చెప్పవచ్చని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement