ntr arogya seva
-
ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ నుంచి ‘వాడి’ పేరు తీసేస్తా
సాక్షి, అమరావతి : తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరు ఎక్కడా కనిపించకుండా చేసేందుకు చంద్రబాబు పన్నిన కుట్ర బట్టబయలైంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు, అన్న నందమూరి తారకరామారావు పేరును ఏ ప్రభుత్వ పథకానికీ లేకుండా చేసేందుకు చంద్రబాబు, తోకపత్రిక యజమాని రాధాకృష్ణతో కలసి ఎన్టీఆర్‌ను దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా.. అసలు ఆయన పేరే ఎక్కడా కన్పించకుండా చేసేందుకు ఇద్దరూ కలసి పన్నిన కుట్రపై ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని పేరు ఇంకా ఎందుకు మార్చలేదు అన్న తోకపత్రిక ఎండీ రాధాకృష్ణతో.. తెలుగుదేశం వ్యవస్థాపకుడు అన్న ఎన్టీ రామారావును ఉద్దేశించి ‘‘వాణ్ణి అనవసరంగా క్యారీ చేస్తున్నాం.. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలోంచి వాడి పేరు ఎత్తేసి మన మీడియాలో ఫుల్ పబ్లిసిటీ ఇద్దాం. ఆరు నెలల తర్వాత ఇక చూసుకో..’’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఎన్టీఆర్ పేరుతో ఉన్న ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య భరోసా)ను పేరు మార్చడంతోపాటు ఆరు నెలల తర్వాత పూర్తిగా దీనిని ఎత్తి వేయాలని వారు పథకం వేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, చంద్రబాబు మధ్య ఈ కుట్రకు సంబంధించి జరిగిన సంభాషణల వీడియో ‘సాక్షి’కి లభించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. టీవీ లైవ్ ప్రోగాంకు ముందు వీరిద్దరూ మాట్లాడుకున్న మాటలు వీరి కుట్రను బట్టబయలు చేశాయి. వారు తలచుకుంటే ఎంత విష ప్రచారమైనా చేయగలరని, దేనినైనా తారుమారు చేసే కుట్రలకు బీజాలు వేస్తారని మరోమారు రూఢీ అయింది. ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ వైద్య భరోసా అనే పేరు మార్చిన విషయం విదితమే. ఇందులో ఎన్టీఆర్ పేరును తొలగించే విషయం రాధాకృష్ణ చంద్రబాబు మధ్య చర్చకు వచ్చింది. పేరు తొలగిద్దామనగానే తీసేయండి అని రాధాకృష్ణ సలహా ఇచ్చేశారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది... వాడి పనైపోయింది చంద్రబాబు : అప్పుడా టెక్నాలజీ లేదు. ఇప్పుడు వినియోగిస్తున్నాం. అదో టెక్నాలజీ. ఉద్యోగాలు, గిద్యోగాలు పోవడం..కరువు వచ్చినప్పుడు చేయకుండా పోవడం, ఉద్యోగస్తులను తిట్టడం.... రాధాకృష్ణ : అప్పుడు మీరు చేసినంత ఫుడ్‌ఫర్ వర్క్ ఎవరూ చేయలేదు. చంద్రబాబు : దానిని మిస్ యూజ్ చేశారు. రాధాకృష్ణ : ఫస్ట్ వైజాగ్, తర్వాత తిరుపతి, చివరకు విజయవాడ లైవ్‌లోకి తీసుకోండి. ఏబీఎన్ లైవ్‌కు యూట్యూబ్‌లో హైయ్యెస్ట్ లైక్స్ రావాలి. రాధాకృష్ణ : యూట్యూబ్‌లో మనది టాప్. చంద్రబాబు : వ్యూయర్షిప్లో మనది ఎంత? రాధాకృష్ణ : మనది మూడు లేదా నాలుగో స్థానం టెక్నికల్ టీమ్: (చంద్రబాబుతో) వైజాగ్ ఇంకో సిటీని కలిపాం సార్ చంద్రబాబు : ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయి? రెండూ కలిపితే లక్షా ఇరవై వేలు ఉంటాయా? నేను చెప్పినప్పుడు నీవు వస్తావా? రాధాకృష్ణ : వచ్చినా నష్టంలేదు. చంద్రబాబు : నేను అడిగినప్పుడు నీవు ఆపరేట్ చేయి. రాధాకృష్ణ : ప్యాకేజీ ఇంకా మొదలు కాలేదుగా. వేరే వ్యక్తి : మొదలు కాలేదు సర్. రాధాకృష్ణ :ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనే ఉందా పేరు? చంద్రబాబు : వాడి పేరు మార్చాలి.. మారుస్తున్నా.. రాధాకృష్ణ : మొన్న చెప్పింది ఇదే. దాన్ని టోటల్‌గా రీవ్యాంప్ చేయాలి. దానికి భారీగా మన మీడియాలో పబ్లిసిటీ ఇచ్చేద్దాం. చంద్రబాబు : మార్చేస్తున్నా. వేరే పేరు మార్చేస్తున్నా. వాడి పనై పోయింది (ఎన్టీఆర్‌ను ఉద్దేశించి) రాధాకృష్ణ : ఆ ఓకే. చంద్రబాబు : ఎన్టీఆర్... పేరు మార్చాలి. రాధాకృష్ణ : దానిని వేరే పేరు మార్చాలి. దానిని యూనివర్సల్ హెల్త్ స్కీమ్ చేస్తున్నారు కదా. పేరు మార్చేద్దాం. పబ్లిసిటీ బాగా ఇద్దాం. రీవ్యాంప్ చేద్దాం. ఈలోగా టెక్నికల్ వారితో సంభాషణ ఏ సబ్జెక్టులు ఉన్నాయి. వైజాగ్‌లో ఏమి పెట్టారు. వైజాగ్‌లో ఎల్ఈడీ...తదితర అంశాలున్నాయి. -
ఎన్టీఆర్‌పై తీవ్ర అసభ్య పదజాలంతో బాబు తిట్ల దండకం
-
కర్నూలు జిల్లాలో విషాదం
-
వైద్యమిత్రల మెడపై పరీక్ష కత్తి
తణుకు అర్బన్ :ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో పనిచేస్తున్న (గతంలో ఆరోగ్యశ్రీ పథకం) వైద్యమిత్రలను తొలగించి పంతం నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ కుట్రలో భాగంగా ఎక్కడా లేనివిధంగా నిబంధనలు వారిపై రుద్దుతున్నారు. వైద్యమిత్రలకు పరీక్ష నిర్వహించి నూటికి 75 మార్కులు వచ్చిన వారిని కొనసాగిస్తామని ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం. 2008లో దివంగత ముఖ్యమంత్రి రూపొందించిన ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేసేందుకు అప్పట్లో జిల్లాలో 160 మందిని వైద్య మిత్రలుగా నియమించారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం 2015లో జీఓ 28ని తీసుకువచ్చి వైద్యమిత్రలను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. దీనిని వ్యతిరేకించిన మిత్రలు ఆ జీవోను రద్దుచేయాలని కోరుతూ ధర్నాలు, నిరసనలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం మిత్రలకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో తిరిగి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా మిత్రలకు అనుకూలంగానే తీర్పునిచ్చినా అవసరమైతే వారికి మెరుగైన శిక్షణనిచ్చి పరీక్ష నిర్వహించుకోమని ప్రస్తావించడంతో వాటిని ఆధారంగా చేసుకుని పరీక్షకు రంగం సిద్ధం చేసింది. ఇంత కక్షా.. మొదటి నుంచి వైద్యమిత్రలపై టీడీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోం దనే విమర్శలు ఉన్నాయి. దీనిలో భాగంగానే వారికి ఇంగ్లిష్‌లో ఆన్లైన్ పరీక్ష నిర్వహించి ఎక్కడా లేనివిధంగా నూటికి 75 మార్కులు పాస్ మార్కులుగా నిర్ణయించింది. ఇలా పరీక్ష నిర్వహించాలని జిల్లా కో–ఆర్డినేటర్‌కు ఆదేశాలిచ్చింది. దీంతో వచ్చేనెల 13న జిల్లాలోని మిత్రలందరికీ రాజమండ్రిలో పరీక్షకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న మిత్రలు మాత్రం పరీక్ష రాసేందుకు తాము సిద్ధంగా లేమని తిరిగి ఉద్యమబాట పడతామని, అవసరమైతే మరల న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతున్నారు. గతంలో 160.. ప్రస్తుతం 105 జిల్లాలోని నెట్వర్క్ ఆస్పత్రులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెట్వర్క్ మిత్రలు 40, పీహెచ్సీ మిత్రలు 65 మంది ఉన్నారు. గతంలో మొత్తం 160 మంది ఉండగా ప్రభుత్వ విధానాలతో విసుగెత్తి 55 మంది ఉద్యోగం వదలి వెళ్లిపోయారు. పదేళ్లుగా వైద్య మిత్రలుగా ఉన్న తాము ఈ వయసులో ఇప్పుడు కొత్త ఉద్యోగాన్ని ఎలా వెతుక్కోగలమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహానుభావుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన కొలువు నుంచి ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం తమను తొలగించాలని చూస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఆందోళనలో వైద్యమిత్రలు పరీక్ష రాయకపోతే తీసేస్తామంటున్నారు.. పరీక్ష రాస్తే 75 మార్కులు సాధించగలమా.. ఇది జిల్లాలో విధుల్లో ఉన్న వైద్య మిత్రల మధ్య తలెత్తిన సమస్య. కొందరు పరీక్షకు వెళ్లవద్దని భీష్మించుకున్నా మరికొందరు మాత్రం పరీక్షకు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి మిత్రలకు ఏం చేయాలో తెలియక ఆందోళనలో పడ్డారు. ప్రభుత్వ విధానాలకు తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోతున్నారు. పరీక్షకు సిద్ధంగా లేము ప్రభుత్వం అన్యాయంగా తమను తొలగించాలని కుట్ర పన్నుతోంది. పదేళ్లుగా ఈ ఉద్యోగంలో చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్నాం. ఎక్కడా లేని నిబంధనలు మాపై రుద్దేలా ఇంగ్లిష్‌లో నిర్వహించే ఆన్లైన్ పరీక్షలో నూటికి 75 మార్కులు వస్తే పాసయినట్లని చెబుతుండటం దారుణం. పరీక్ష రాసేందుకు మేం సిద్ధంగా లేము.– పీవీ దుర్గాప్రసాద్, వైద్య మిత్ర యూనియన్ జిల్లా అధ్యక్షుడు మమ్మల్ని కొనసాగించాలి 2008లో ఆరోగ్య మిత్రల పోస్టుల కోసం మాకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. తర్వాత ప్రత్యేక శిక్షణనిచ్చి పరీక్ష నిర్వహించి మమ్మల్ని ఎంపిక చేశారు. అప్పటి నుంచి వైద్యసేవల్లో ఉన్నాం. ప్రభుత్వం మమ్మల్ని అన్యాయం చేయకుండా ప్రస్తుత విధానాలకు ఏదైనా శిక్షణ అవసరమైతే ఇప్పించి మమ్మల్ని కొనసాగించాలి.– ఎం.దుర్గాభవాని, వైద్య మిత్ర, తణుకు ప్రభుత్వ ఆదేశాలమేరకు పరీక్ష వైద్య మిత్రలను కొనసాగించేందుకు ప్రభుత్వం ఆన్లైన్ పరీక్ష రాజమండ్రిలో నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం వారి విధులకు సంబంధించి సబ్జెక్టులో నిర్వహించే ఆన్లైన్ పరీక్షలో 75 మార్కులు వచ్చిన వారిని కొనసాగించాలని ఆదేశాలు ఉన్నాయి. జిల్లాలోని 105 మంది ఈ పరీక్షకు హాజరు కావాల్సి ఉంది.– డాక్టర్ అవినాష్, ఎన్టీఆర్‌వైద్యసేవ, జిల్లా కో–ఆర్డినేటర్, ఏలూరు -
ఆలస్యం.. అమృతం.. విషం
సాక్షి, గుంటూరు: ఎన్టీఆర్ వైద్య సేవలు ఆలస్యం అమృతం.. విషం అన్న చందంగా మారాయి.పేదలకు కార్పొరేట్ వైద్యసేవలను ఉచితంగా అందించేందుకు దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో లక్షల ఖర్చయ్యే ఆపరేషన్లను పేదలకు ఉచితంగా చేయించి ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్య పథకానికి అనారోగ్యం వచ్చింది. గతంలో ఉన్న పేరును మార్చి ఎన్టీఆర్ వైద్యసేవగా నామకరణం చేశారు. గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించుకునే రోగులకు ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ఒక్క రోజులో అనుమతి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ అనుమతులు రావాలంటే నాలుగు రోజులకుపైగా పడుతోంది. దీంతో అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులకు సకాలంలో ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేయటంతో జీజీహెచ్ లాంటి పెద్దాస్పత్రి మొదలుకొని పలు నెట్వర్క్ ఆస్పత్రుల్లో సైతం ఆపరేషన్లు నిలిపివేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు జరగాలంటే రోజుల తరబడి ఆస్పత్రుల్లో మంచాలపై మూలగాల్సిన దుస్థితి ఏర్పడిందని రోగులు వాపోతున్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ అనుమతులు రాకపోవడంతో రోగుల బంధువుల నుంచి తమకు తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరుగుతోందని, మరోవైపు ట్రస్టు అనుమతి ఇవ్వకుండా ఆపరేషన్లు చేస్తే డబ్బులు మంజూరు కావడం లేదని ఆస్పత్రుల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. గతంలో మాదిరిగా వెంటనే అనుమతులు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు వైద్యులు కోరుతున్నారు. పథకంలో పలు మార్పులు.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్టీఆర్ వైద్యసేవ పథకానికి ఎన్నో మార్పులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకం 2007వ సంవత్సరంలో ప్రారంభం కాగా గుంటూరు జిల్లాలో 2008 జూలై 7 నుంచి ప్రారంభమైంది. కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో 2011లో ఆరోగ్య పథకంలో మార్పులు జరిగాయి. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తున్న 126 రకాల ఆపరేషన్లు ప్రైవేటు ఆస్పత్రుల నుంచి తొలగించి కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేసేలా మార్పులు చేశారు. అయితే టీడీపీ ప్రభుత్వం 2014 అక్టోబర్ 2న ఎన్టీఆర్ వైద్యసేవగా పేరు మార్చి అనుమతుల మంజూరులో మాత్రం కోతలు విధించింది. వెరిఫికేషన్ ఆలస్యం అవుతుంది ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ద్వారా ఆపరేషన్లు చేసేందుకు కొంత ఆలస్యం అవుతున్న మాట వాస్తవమే. న్యూరోసర్జరీ ఆపరేషన్లతోపాటు మరికొన్ని ఆపరేషన్లకు అనుమతుల్లో జాప్యం జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఇకమీదట ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటాం.– డాక్టర్ వడ్లమూడి శ్రీనివాసరావు,ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కోఆర్డినేటర్ -
వైద్య బిల్లులకు చిల్లు..!
♦ ఎన్టీఆర్ ఆరోగ్య సేవల అంచనా వ్యయం రూ.850 కోట్లు ♦ బడ్జెట్లో కేటాయించింది రూ.500 కోట్లే.. ♦ ఇప్పటి దాకా ఇచ్చిన నిధులు రూ.125 కోట్లు ఎన్టీఆర్ ఆరోగ్యసేవగా పేరు మార్చుకున్న ‘ఆరోగ్యశ్రీ’ పథకం అనారోగ్యం పాలైంది. సామాన్యుడికి వైద్యసేవలు అందించలేక కునారిల్లుతోంది. పెద్ద జబ్బుల బాధితులకు ఆపన్నహస్తం అందిస్తూ వస్త్తున్న పథకం నీరసపడిపోయింది. పథకానికి ప్రభుత్వం సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో బాధితులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. ప్రభుత్వం సరిపడా నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు కొండల్లా పేరుకుపోతున్నాయి. బకాయిలు చెల్లించక ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ, మౌలిక వసతులు లేక ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ చికిత్సలు తిరస్కరించడంతో రోగులు విలవిల్లాడుతున్నారు. పథకానికి ఏడాదికి కనీసం రూ.850 కోట్లు వ్యయం అవుతుందని బడ్జెట్ కేటాయింపుల్లో అధికారులు నివేదిక ఇస్తే... ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించి చేతులు దులుపుకొంది. ఆర్నెళ్ల కాలానికి గాను నిధులు ఇవ్వాల్సి ఉండగా... మూడు నెలలకు చెందిన రూ.125 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంతో ప్రైవేటు ఆస్పత్రులకు రూ.60 కోట్ల వరకూ బకాయిలు పేరుకుపోయాయి. దీంతో చికిత్సలు కొనసాగించలేమని ప్రైవేటు ఆస్పత్రులు కరాఖండిగా తేల్చి చెబుతున్నాయి. విధిలేక రోగులు కళ్లు తేలేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ ఆరోగ్యసేవ (ఆరోగ్య శ్రీ) నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. ఆరో గ్యశ్రీ కింద వైద్యం పొందాల్సిన వందలాది మంది బాధితులకు ఈ పరిణామం తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. గత కొన్ని నెలలుగా ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సిన మేరకు నిధులు మంజూరు చేయడం లేదు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చికిత్స లూ మందగించినట్టు అధికార వర్గాలు పేర్కొంటు న్నాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో గుండె, న్యూ రో జబ్బులకు సంబం ధించిన చికిత్సలను ప్రైవేటు ఆస్పత్రులు తిరస్కరి స్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. విభజన తర్వాత హైదరాబాద్‌లోని ఆస్పత్రులు ఏపీ నుంచి వచ్చే రోగులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. మూడు మాసాలకు ఇచ్చింది రూ.125 కోట్లే ఆరోగ్యశ్రీ పథకానికి ఈ ఏడాది బడ్జెట్లో కేటాయిం చింది కేవలం రూ.500 కోట్లు మాత్రమే. కానీ ఇప్పటి వరకూ పథకం కోసం ఆర్థిక శాఖ ఇచ్చింది తొలి త్రైమాసికానికి కేవలం రూ.125 కోట్లు మాత్ర మే అని ట్రస్ట్ అధికారి ఒకరు చెప్పారు. అంటే ఏప్రిల్, మే, జూన్ మాసాలకు మాత్రమే ఈ సొమ్ము ఇచ్చారు. జూలై నుంచి ఇప్పటివరకూ రెండో త్రైమా సికానికి సంబంధించిన నిధులు ఇవ్వలేదని అధికా ర వర్గాలు తెలిపాయి. వాస్తవానికి రూ.2.50 లక్షల కు ప్రీమియం పెంపు, 938 జబ్బులను 1,038కి పెంచడం కారణంగా ఏడాదికి కనీసం రూ.850 కోట్లు వ్యయం అవుతుందని బడ్జెట్ కేటాయింపుల సమయంలోనే అధికారులు నివేదిక ఇచ్చారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చింది. అదికూడా 7 నెలలు గడి చినా మూణ్నెళ్లకు మాత్రమే నిధులివ్వడం పథకం డోలాయమానంలో పడింది. మరోవైపు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చే నిధులు కూడా త్రైమాసికానికే ఇచ్చారని అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు రూ.60 కోట్ల వరకూ బకాయిలు ఉన్న ట్టు తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రతినిధి చెప్పారు. సూపర్ స్పెషాలిటీ కష్టాలు... ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క విశాఖపట్నం మినహా సూపర్ స్పెషాలిటీ సేవలు ఎక్కడా లేవు. దీంతో రోగులు ప్రధానంగా హైదరాబాద్‌కు రావాల్సిందే. తెలంగా ణ రాష్ట్ర పరిధిలోని ఈ ఆస్పత్రులు ప్యాకేజీలు పెం చాలని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో అటు ప్రభుత్వ పరిధిలోగానీ, ఇటు ప్రైవేటులోగానీ క్యాన్సర్ ఆస్పత్రులు లేవు. వీళ్లందరూ హైదరా బాద్‌కు రావాల్సిందే. ఈ పరిస్థితుల్లో ఇక్కడి ఆస్పత్రులు ప్రస్తుత ప్యాకేజీ ధరలపై చికిత్సలు అందించేందుకు సుముఖంగా లేకపోవడం, మరోవైపు బకాయిలు పేరుకుపోతూండటంతో ఖరీదైన చికిత్సల విషయంలో జాప్యం చేస్తున్నట్టు స్వయానా ఆస్పత్రుల ప్రతినిధులే చెబుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో భారీగా తగ్గిన సర్జరీలు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఏపీలోని బోధనాసుపత్రులు ఆరోగ్యశ్రీ నిధుల జాప్యంతో మరింత కునారిల్లుతున్నాయి. గడిచిన 8 నెలల్లో శస్త్రచికిత్సల సంఖ్య భారీగా తగ్గినట్టు ఆస్పత్రుల ప్రిన్సిపల్స్ చెప్పారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి నిధు లు రాకపోవడం, సూపర్ స్పెషాలిటీ వైద్యులు లేకపోవడం కారణంగా చెప్పవచ్చని అంటున్నారు. -
పేరు మార్పుతో పేదలకు తిప్పలు
ఆరోగ్యశ్రీ’లో టీడీపీ మార్పు, చేర్పులు అవసరమైన పత్రాల ముద్రణలో జాప్యం సర్టిఫికెట్లు ఇవ్వలేకపోతున్న అధికారులు సకాలంలో చికిత్స అందక రోగుల అగచాట్లు కాకినాడ క్రైం : నిరుపేద రోగులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సను అందుబాటులోకి తెచ్చి, పునర్జన్మను ప్రసాదిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ప్రస్తుతం ‘పేరు మార్పు’ ప్రక్రియతో సకాలంలో ఆదుకోవడం లేదు. పథకం పేరు మార్చాలని నిర్ణయించిన సర్కారు అవసరమైన పత్రాలు ముద్రించక పోవడంతో కొందరికి చికిత్సలో జా ప్యం తప్పడం లేదు.పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో ఏర్పాటు చేసిన రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు ద్వారా జిల్లాలో ఇప్పటి వరకూ 1.80 లక్షల మంది రూ.428 కోట్లు వ్యయమయ్యే వైద్యసేవలు అందుకున్నారు. కాగా ఆరోగ్య శ్రీ పథకాన్ని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా పేరు, లోగో మార్చాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో పథకానికి సంబంధించి లబ్ధిదారులకు అందించే పత్రాలను ముద్రించడం మానివేశారు. కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు తెల్ల రేషన్ కార్డు లేని వారికి, రచ్చబండలో రేషన్ కార్డు పొందిన వారికి, నవజాత శిశువులకు, తాత్కాలిక రేషన్ కార్డుదారులకు పథకాన్ని వర్తింపజేసేందుకు కలెక్టరేట్లో ఆరోగ్య శ్రీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయానికి రోజూ సుమారు 10 మంది దరఖాస్తు చేసుకుంటుంటారు. అయితే నెల రోజుల నుంచి పత్రాలు లేకపోవడంతో వారిని వెనక్కి పంపివేస్తున్నారు. దీంతో అత్యవసరమైన వారు హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. పది రోజులు మాత్రమే అర్హత ఉండే అనుమతి పత్రం జారీపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నెల రోజుల నుంచి తిరుగుతున్నా ఇంకా పత్రాలు రాలేదంటున్నారని రోగులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి నిరుపేదలకు సత్వరం వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. రెండు రోజుల్లో రావచ్చు.. ఆరోగ్యశ్రీ సేవలకు అర్హులంటూ సర్టిఫికెట్ ఇచ్చే పత్రాలు లేకపోవడం తో జారీ చేయడం లేదని ఆ విభాగం కో ఆర్డినేటర్ డాక్టర్ ప్రసన్నాం జనేయులు చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దృష్టికి తీసుకువెళ్లామని, రెండు రోజుల్లో పత్రాలు వచ్చే అవకాశాలున్నాయని అన్నారు. అయితే రోగులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వాస్పత్రిలో చేర్చి శస్త్ర చికిత్సలు చేయిస్తున్నామని, అత్యవసరమైన వారికి జీజీహెచ్‌లోని సీఎంసీఓ కార్యాలయం ద్వారా సర్టిఫికెట్ అందజేసే ఏర్పాటు చేశామని చెప్పారు. -
ఆరోగ్యశ్రీపై పేరు ఎన్టీఆర్ ఆరోగ్యసేవగా మార్పు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వాస్పత్రులకు మేలు జరిగిందని, ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రెండోరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడారు. ఆరోగ్య శ్రీ ద్వారా 65% నిధులు ఆస్పత్రులకు వచ్చాయని, కేవలం 35 శాతం మాత్రమే వైద్యులకు అందుతుందని వైఎస్ జగన్ అన్నారు. పేదవాళ్లకు కార్పొరేట్ వైద్యం అందిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా.. రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్యసేవగా మారుస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఆరోగ్య శ్రీలో 100 జబ్బులను అదనంగా చేరుస్తున్నామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో యూజర్ ఛార్జీలను పెంచే ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో బయోమెట్రిక్, ట్రాకింగ్ విధానంపెడతామని మంత్రి శ్రీనివాస్ అన్నారు.