అనంతపురం సెంట్రల్ : పన్ను వసూలు, రిజిస్ర్టేషన్‌లలో ‘అనంత’ ఆర్టీఏ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని రవాణా శాఖ ఉప కమిషనర్ సుందర్‌వద్దీ తెలిపారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... పన్ను వసూలులో గతేడాది కంటే 23.40 శాతం వృద్ధి రేటు సాధించినట్లు వివరించారు. ఏప్రిల్ 15 నుంచి నుంచి డిసెంబర్ 15 వరకూ మూడు త్రైమాసికాల్లో రాష్ర్టంలోనే జిల్లా ముందంజలో ఉందన్నారు. గతేడాది రూ. 85.39 కోట్లు వసూలు చేయగా ఈ ఏడాది రూ. 105.37 కోట్లు వసూలు సాధించినట్లు వివరించారు.
వాహన తనిఖీలు ముమ్మరంగా చేపట్టడం ద్వారా పన్నుల వసూలు చేయడం, జరిమానాలు విధించడం, వివిధ కేసుల్లో పట్టుకున్న వాహనాలకు వేలం నిర్వహించడం తదితర అంశాలన్నీ వృద్ధి సాధించేందుకు ఆస్కారం కలిగింది. చివరి త్రైమాసికంలో మరింత పకడ్బందీ చర్యలు చేపట్టి జిల్లాను నెంబర్‌వన్ స్థానంలో నిలుపుతామని ఆయన వివరించారు.
రాష్ట్రంలోనే అగ్రస్థానం
Published Sun, Jan 1 2017 11:45 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement