ప్రైవేటు ఆస్పత్రుల్లో పాత రూ.500కు చెల్లుచీటీ
గుంటూరు మెడికల్: ప్రైవేటు ఆస్పత్రుల్లో పాత రూ.500 నోట్లు రోగుల వద్ద తీసుకోరని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్‌ఫేర్ డాక్టర్ అరుణకుమారి డిసెంబర్ 4న ఇచ్చిన ఆదేశాల మేరకు నోట్లు తీసుకోరనే విషయాన్ని తెలియజేస్తున్నామన్నారు. నవంబర్ 29న ప్రైవేటు ఆస్పత్రుల్లో పాత రూ.500 నోట్లు తీసుకోవాలని ఆదేశించారని, ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నారని వివరించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.