గార్లదిన్నె : మండలంలోని ఎం.కొత్తపల్లి గ్రామంలో మంగళవారం ఓ వృద్ధురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. కేశమ్మ(75) అనే వృద్ధురాలు గత కొంత కాలంగా మోకాళ్ల నొప్పి, అనారోగ్యంతో బాధపడుతుండేది. పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా నయం కాకపోవడంతో కుటుంబసభ్యులతో రోజూ మధనపడుతుండేది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు భర్త చెన్నారెడ్డి, కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్ తెలిపారు.