old woman suicides
-
వృద్ధురాలి ఆత్మహత్య
గార్లదిన్నె : మండలంలోని ఎం.కొత్తపల్లి గ్రామంలో మంగళవారం ఓ వృద్ధురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. కేశమ్మ(75) అనే వృద్ధురాలు గత కొంత కాలంగా మోకాళ్ల నొప్పి, అనారోగ్యంతో బాధపడుతుండేది. పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా నయం కాకపోవడంతో కుటుంబసభ్యులతో రోజూ మధనపడుతుండేది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు భర్త చెన్నారెడ్డి, కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రదీప్‌కుమార్ తెలిపారు. -
రైలు కింద పడి వృద్ధురాలి ఆత్మహత్య
ధర్మవరం టౌన్ : ధర్మవరంలోని రేగాటిపల్లె రైల్వే గేట్ వద్ద రైలు కింద పడి పెద్దక్క(92) బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు హిందూపురం రైల్వే పోలీసులు తెలిపారు. కొంతకాలంగా కడుపునొప్పి, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె జీవితంపై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
వృద్ధురాలి ఆత్మహత్య
అమరాపురం(మడకశిర) : అమరాపురం మండలం పి.శివరం గ్రామానికి చెందిన చెన్నబసమ్మ(80) శనివారం రాత్రి బాగా పొద్దుపోయాక ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వెంకటస్వామి ఆదివారం తెలిపారు. ఒంటరి జీవితం భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని తనువు చాలించినట్లు వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు.