ధర్మవరం టౌన్ : ధర్మవరంలోని రేగాటిపల్లె రైల్వే గేట్ వద్ద రైలు కింద పడి పెద్దక్క(92) బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు హిందూపురం రైల్వే పోలీసులు తెలిపారు. కొంతకాలంగా కడుపునొప్పి, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె జీవితంపై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.