18న జిల్లాకు నోబోల్‌ గ్రహీత కైలాస్‌ సత్యార్థి | On the 18th district, Nobel recipient Kailas Satyarthi | Sakshi
Sakshi News home page

18న జిల్లాకు నోబోల్‌ గ్రహీత కైలాస్‌ సత్యార్థి

Published Mon, Sep 11 2017 10:29 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

On the 18th district, Nobel recipient Kailas Satyarthi

  •  పకడ్బంధీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశం
  • అనంతపురం అగ్రికల్చర్‌:  నోబెల్‌ గ్రహీత కైలాస్‌ సత్యార్థి ఈనెల 18న జిల్లా పర్యటన నేపథ్యంలో పకడ్బంధీ ఏర్పాటు చేయాలని  కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ఆదేశించారు. ఏర్పాట్లపై సోమవారం స్థానిక రెవెన్యూభవన్‌లో వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నోబెల్‌ గ్రహీత సత్యార్థి భారతయాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు పర్యటిస్తున్న నేపథ్యంలో 18న బెంగళూరు నుంచి కొడికొండ చెక్‌పోస్టు సమీపంలో రాగమయూరి ఎలక్ట్రానిక్స్‌ పార్క్‌కు చేరుకుంటారన్నారు. 

                    21, 22న సీఎం కాన్ఫరెన్స్‌: ఈనెల 21, 22 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసిన నేపథ్యంలో జిల్లా ప్రగతి నివేదికలు ఈనెల 14వ తేదీలోపు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఆయా శాఖల ప్రగతి నివేదికలు, పపర్‌పాయింట్‌ ప్రజెంటేషన్లు గడువులోపు సీపీవో వాసుదేవరావుకు అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ టీకే రమామణి, జేసీ–2 ఖాజామొహిద్దీన్, డీఆర్వో మల్లీశ్వరీదేవి, డ్వామా పీడీ నాగభూషణం, ఏపీఐఐసీ జిల్లా మేనేజర్‌ రఘునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement