Kailas satyarthi
-
ఆయన స్ఫూర్తితోనే సీఎం జగన్ ప్రభుత్వం కూడా.. మంత్రి బుగ్గన
‘‘ఈరోజు ప్రతి బిడ్డకు జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, ఆరోగ్య హక్కు, విద్య హక్కు, భద్రత హక్కు, గౌరవ హక్కు, సమానత్వం, శాంతి హక్కు ఉండాల్సిన సమయం ఇది’’ సామాజిక ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థి చెప్పిన మాటలివి. ఈ స్ఫూర్తితోనే వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం కూడా చిన్నారుల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా బాలల సంక్షేమ పద్దును వివరిస్తూ నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి గురించి ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఓ ఆసక్తికరమైన కథ చెప్పారు. చిన్నతనంలో సత్యార్థికి ఎదురైన అనుభవం గురించి సందర్భోచితంగా ప్రసంగం మధ్యలో ప్రస్తావించారు ఆర్థిక మంత్రి బుగ్గన. ‘‘కైలాష్ సత్యార్థి వాస్తవానికి సంపన్న కుటుంబంలో పుట్టారు. చిన్నతనంలో ఆయనకు ఎదురైన ఓ సంఘటనే బాలల హక్కుల కోసం ఆయన పోరాడేలా చేసింది. ఓ రోజూ స్కూలుకు వెళుతూ బడి బయట ఓ చెప్పులు కుట్టే కుర్రాడిని చూశారు. తానెందుకు బడికి పోగలుగుతున్నాను.. ఆ కుర్రాడెందుకు చెప్పులు కుట్టుకుంటూ బతకున్నాడని ఆనాడు కైలాష్ సత్యార్థి ఆలోచించారు. దానిపై చాలా రోజుల మదన పడ్డారు. ఓ రోజు వర్షం పడుతుంటే.. చెప్పులు నానుతున్నాయంటూ ఆ చెప్పులు కుట్టే పిల్లాడిపై అతడి తండ్రి అరిచాడట. అది చూసి ఓ వైపు మనిషి తడవకుండా ఉండేందుకు గొడుగు పట్టుకుంటుంటే.. ఇక్కడ చెప్పులు తడవకూడదంటూ తండ్రి అరిచాడెందుకని కైలాష్ సత్యార్థి ఆవేదన చెందారు. ఆ పిల్లాడు బడికి ఎందుకు వెళ్లకూడదని అనుకున్నారు. అలాంటి పిల్లలకోసం ‘బచ్ పన్ బచావో’ అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా దాదాపు 83 వేల మంది పిల్లలకు పని నుంచి విముక్తి కల్పించారు’’ అని కైలాష్ సత్యార్థి గురించి ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం కూడా కైలాష్ సత్యార్థిని స్ఫూర్తిగా తీసుకుని చిన్నారుల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. మహిళా శిశు సంక్షేమం రూ. 4,382 కోట్లు బడ్జెట్ కేటాయించిన విషయం తెలిసిందే. -
18న జిల్లాకు నోబోల్ గ్రహీత కైలాస్ సత్యార్థి
పకడ్బంధీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వీరపాండియన్ ఆదేశం అనంతపురం అగ్రికల్చర్: నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి ఈనెల 18న జిల్లా పర్యటన నేపథ్యంలో పకడ్బంధీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. ఏర్పాట్లపై సోమవారం స్థానిక రెవెన్యూభవన్‌లో వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నోబెల్ గ్రహీత సత్యార్థి భారతయాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పర్యటిస్తున్న నేపథ్యంలో 18న బెంగళూరు నుంచి కొడికొండ చెక్‌పోస్టు సమీపంలో రాగమయూరి ఎలక్ట్రానిక్స్ పార్క్‌కు చేరుకుంటారన్నారు. 21, 22న సీఎం కాన్ఫరెన్స్: ఈనెల 21, 22 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో జిల్లా ప్రగతి నివేదికలు ఈనెల 14వ తేదీలోపు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖల ప్రగతి నివేదికలు, పపర్‌పాయింట్ ప్రజెంటేషన్లు గడువులోపు సీపీవో వాసుదేవరావుకు అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ టీకే రమామణి, జేసీ–2 ఖాజామొహిద్దీన్, డీఆర్వో మల్లీశ్వరీదేవి, డ్వామా పీడీ నాగభూషణం, ఏపీఐఐసీ జిల్లా మేనేజర్ రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
నోబెల్ వేదికపై మెరిసిన భారత ఉపఖండం
సత్యార్థి, మలాలాకు శాంతి పురస్కారం నోబెల్ వేదికపై 2014లో భారత ఉపఖండం మెరిసింది. బాలల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న భారత్‌కు చెందిన కైలాశ్ సత్యార్థి(60), పాక్ బాలిక మలాలా యూసఫ్‌జాయ్(17) ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారాన్ని సంయుక్తంగా స్వీకరించారు.ఓస్లొలో డిసెంబర్ 10న వైభవంగా జరిగిన నోబెల్ప్రదాన కార్యక్రమంలో 2014 సంవత్సరానికిగాను వారిరువురికి ఈ అవార్డ్‌ను అందించారు. కైలాశ్ తాను నిర్వహిస్తున్న ‘బచ్పన్ బచావో ఆందోళన్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా 80 వేలమంది బాలకార్మికులను రక్షించి పాఠశాలల్లో చేర్పించారు. బాలికల విద్యా హక్కు కోసం ఉద్యమించినందుకు తాలిబాన్ ఉగ్రవాదులు మలాలాపై కాల్పులు జరిపారు. మలాలా తలకు తీవ్ర గాయమైనా జంకకుండా పిల్లల హక్కుల కోసం ఉద్యమిస్తోంది.