వినాయక విగ్రహం నిమజ్జనం సందర్భంగా ప్రమాదవశాత్తు ఒకరు చనిపోయారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకాల సముద్రతీరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని పొన్నలూరు మండల కేంద్రానికి చెందిన కొందరు బుధవారం మధ్యాహ్నం తమ గ్రామంలో నెలకొల్పిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు సముద్రతీరానికి చేరుకున్నారు. ఆరుగురు వ్యక్తులు విగ్రహాన్ని సముద్రంలో వదిలేసేందుకు లోపలికి వెళ్లారు. అయితే, అలల తాకిడికి వారంతా నీటి ఉధృతిలో చిక్కుకున్నారు. ఒడ్డున ఉన్న వారు మెరైన్ పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే అక్కడికి చేరుకుని ఐదుగురిని ఒడ్డుకు తీసుకురాగలిగారు. లింగంగుంట రమేష్ అనే యువకుడు మాత్రమే అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
నిమజ్జనంలో అపశ్రుతి..ఒకరు మృత్యువాత
Published Wed, Sep 14 2016 8:06 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
Advertisement
Advertisement