సిరిసిల్ల (కరీంనగర్) : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం తంగల్లపల్లి క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం చోటుచేసుకుంది.
వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ప్రయాణికుల ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో,లారీ ఢీ- ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు
Published Fri, Aug 26 2016 3:04 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement