నగర శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం 5 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
Feb 1 2017 12:47 AM | Updated on Aug 30 2018 4:10 PM
కర్నూలు(అర్బన్) : నగర శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం 5 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆగి ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన సిమెంట్ లారీని ఐచర్ ఢీకొంది. దీంతో ఐచర్ వాహనంలో నిద్రిస్తున్న కో డ్రైవర్ రవీంద్రరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ విజయకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతి చెందిన రవీంద్రరెడ్డి ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామవాసిగా గుర్తించారు. తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement