ఆన్‌లైన్‌లో కోర్టు కేసుల వివరాలు
Published Sun, Mar 12 2017 12:24 AM | Last Updated on Tue, Sep 5 2017 5:49 AM
తణుకు అర్బన్ : కోర్టుల్లో ఉన్న కేసు లు ఏ స్థాయిలో ఉన్న దీ కక్షిదారులు నేరు గా తెలుసుకునేందు కు ఆన్‌లైన్ విధానా న్ని అమల్లోకి తీసుకురానున్నట్టు నాల్గో అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయసేవా సంస్థ చైర్మన్ జి.గోవింద కేశవరావు తెలిపారు. శనివారం తణుకు కోర్టులో ఉన్న కేసులను ఇ కోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచే కార్యక్రమాన్ని ప్రారంభించి, ఉద్యోగులకు కంప్యూటర్‌పై శిక్షణ నిచ్చారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఇ కోర్ట్స్ వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేయడం ద్వారా కక్షిదారులు సులభంగా వివరాలు తెలుసుకోవచ్చని గోవింద కేశవరావు తెలిపారు. కేసు ఫైలింగ్‌లో ఏయే పత్రాలు దాఖలు చేశారు, తిరిగి వాయిదా ఎప్పుడు వస్తుందనేది పారదర్శకంగా ఉంటుం దన్నారు. ్ఛఛిౌuట్టట.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్ ద్వారా కేసుల వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ఉద్యోగులకు పూర్తిస్థాయి శిక్షణ పూర్తి చేసిన అనంతరం సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. త్వరితగతిన కేసుల పరిష్కారం కోసం ఇప్పటికే లోక్ అదాలత్‌ల ద్వారా ఇరుపక్షాల మధ్య రాజీ చేస్తున్నామన్నారు. తణుకు న్యాయస్థానం ఆవరణలోని ఐదు కోర్టులకు సంబంధించిన కేసులన్నింటినీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని పేర్కొన్నారు. జిల్లా కోర్టు నియమించిన ట్రైనర్ ఉదయ శ్రీనివాస్ ఉద్యోగులకు శిక్షణనిచ్చారు. న్యాయమూర్తి జి.గోవింద కేశవరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి డి.శేషయ్య ఇ కోర్ట్స్ నోడల్ ఆఫీసర్‌గా శిక్షణను పర్యవేక్షించారు.
Advertisement
Advertisement