
జైలు, కోర్టు..దేనికైనా రెడీ: పవన్ కల్యాణ్
హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ మరోసారి ట్విట్టర్లో స్పందించారు. అవసరం అయితే తాను జైలుకైనా, కోర్టులకైనా సంతోషంగా వెళతా, దేనికైనా రెడీ అంటూ ఆయన బుధవారం ట్విట్ చేశారు. కొందరు వ్యక్తులు తనపై కేసులు పెడతామన్నారని.. దీని కోసం మీరు చేయాల్సింది చేయండి. సీమంధ్రా ఎంపీలు పౌరుషం నా మీద కాదు, కేంద్రం దగ్గర చూపించండి.నన్ను తిడితే స్పెషల్ స్టేటస్ రాదు. ఎంపీలు...వ్యాపారం చేయడం తప్పు కాదు. కేవలం 'వ్యాపారమే' చేయడం తప్పు పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
కాగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను రెచ్చగొట్టేవిధంగా పవన్ మాట్లాడారంటూ తెలంగాణ న్యాయవాదులు మంగళవారం జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చేందుకే పవన్ ప్రయత్నిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పవన్ కల్యాణ్ పై విధంగా స్పందించారు. సెక్షన్-8, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై పవన్ కల్యాణ్ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన విషయం తెలిసిందే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎంపీలపై ఆయన చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. పలువురు ఎంపీలు పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
I will be very happy to go to Jail n facing Courts and please kindly do the needful.
— Pawan Kalyan (@PawanKalyan) July 8, 2015
Previous Tweet was in the context of'some group wanting to lodge a police complaint and file a case against me' regarding what I had Spoken.
— Pawan Kalyan (@PawanKalyan) July 8, 2015