మాట్లాడుతున్న ఏజేసీ శివశ్రీనివాస్
అక్టోబర్ 1 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ శివశ్రీనివాస్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై విద్య, వైద్య, విద్యుత్,పోలీస్ ,పోస్టల్, ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించారు.
-
-
అక్టోబర్ 1నుంచి 14 వరకు నిర్వహణ
-
సమీక్షలో ఏజేసీ శివశ్రీనివాస్
ఖమ్మం జెడ్పీసెంటర్: అక్టోబర్ 1 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ శివశ్రీనివాస్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై విద్య, వైద్య, విద్యుత్,పోలీస్ ,పోస్టల్, ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మంలో పరీక్షల నిర్వహణకు 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 10 వతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్‌కు 1848 మంది విద్యార్థులు, 10వ∙తరగతికి 2037 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఖమ్మం నగరంలో రిక్కాబజార్, నయాబజార్, మామిళ్లగూడెం, ఎన్‌ఎస్ కెనాల్, రాజేంద్రనగర్, శాంతి నగర్‌లలో బాలికోన్నతపాఠశాల, జ్యోతి బాలమందిర్ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి రాజేష్, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ కె.శ్రీనివాసరావు, ఓపెన్ స్కూల్ జిల్లా సమన్వయకర్త మురళీకృష్ణ, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శివకుమార్, డివిజనల్ మేనేజర్ రామమూర్తి, సబ్‌ఇన్స్‌పెక్టర్ ఓంకార్, పోస్టల్ సూపరింటెండెంట్ రంగారావు, విద్యుత్ శాఖడీఈ డీఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.