అవకాశాలు అందిపుచ్చుకోవాలి
అవకాశాలు అందిపుచ్చుకోవాలి
Published Mon, Oct 24 2016 10:55 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM
- డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
కర్నూలు సిటీ: ప్రభుత్వం దళితులకు కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సూచించారు. నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా దళిత యువత ముందుకు రావడం లేదన్నారు. సోమవారం స్థానిక ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండులో చంద్రన్న దళితబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల్ కిశోర్‌బాబు హాజరైయ్యారు. సభలో కేఈ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల కోసం అమలు చేస్తున్న పథకాలు పూర్తిస్థాయిలో వారి దరికి చేరడంలేదన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ ప్రభుత్వం ఎస్సీల కోసం పాటుపడుతోందన్నారు. మంత్రి రావెల్ కిశోర్‌బాబు మాట్లాడుతూ సబ్‌ప్లాన్ గురించి అధికారులకు సైతం అవగహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకర్లు ఎస్సీలకు రుణాలు ఇవ్వడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని ఇకపై బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించే బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ డ్వాక్రా సంఘాలకు 43.82 కోట్ల రుణాల చెక్కు, 226 మందికి 3.55 కోట్ల చెక్కు, 20 మంది గిరిజనులకు 10 లక్షల చెక్కును మంత్రులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్, జేసీ హరికిరణ్, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎస్సీ కమిషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు, డైరెక్టర్లు దేవానంద్, ప్రభాకర్, ఎమ్మెల్యే మణిగాంధీ, ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, మాజీ మంత్రి ములింటి మారెప్ప పాల్గొన్నారు.
Advertisement
Advertisement